రొమాంటిక్ క్యారెక్టర్ కలిగిన హాస్యనటుడిగా బుల్లి తెరకు పరిచయమైనా సుడిగాలి సుధీర్ పై తెలుగు రాష్ట్రాలలోని బుల్లితెర ప్రేక్షకులకు మంచి అభిప్రాయమే ఉంది. ఏ అమ్మాయిని చూసినా, ఏ యాంకర్ ని చూసినా, ఏ హీరోయిన్ ని చూసినా చివరికి ఆడవేషంలో ఉన్న మగవారిని చూసినా టెంప్ట్ అవుతున్నట్టు జబర్దస్త్ స్కిట్స్ లలో సుధీర్ కనిపిస్తుంటాడు. ram PRASAD' target='_blank' title='ఆటో రామ్ ప్రసాద్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>ఆటో రామ్ ప్రసాద్, గెట్ అప్ శ్రీను, జబర్దస్త్ జడ్జీలు కూడా సుధీర్ పై అడల్ట్ జోక్స్ వేస్తూ సరదాగా ఆటపాటిస్తుంటారు.

 

 

జబర్దస్త్ షో లో ముఖ్యంగా రష్మి కి లైన్ వేస్తుంటాడు సుధీర్. కానీ రష్మి మాత్రం అతన్ని ఛీ కొడుతూ ఉంటుంది. వీళ్లిద్దరి మధ్య ఏదో ఉన్నట్టు ఎన్నో వార్తలు వచ్చాయన్న విషయం జగమెరిగిన సత్యం. ఐతే ఆ వార్తలన్నీ ఒట్టి పుకార్లని రష్మి తో సహా సుడిగాలి సుధీర్ కూడా అనేక సందర్భాల్లో చెప్పుకొచ్చారు. దీంతో వారిద్దరి మధ్య ఎఫైర్ ఉందనే వార్తలు కాస్త సద్దుమణిగాయి. అయితే తాజాగా ఓ జబర్దస్త్ స్కిట్ లో రష్మి గౌతమ్ సుడిగాలి సుధీర్ పై చేసిన వ్యాఖ్యలు అందర్నీ విస్తుపోయేలా చేస్తున్నాయి. 

 



పూర్తి వివరాలు తెలుసుకుంటే... ఇటీవల ప్రసారమైన సుడిగాలి సుధీర్ స్కిట్ 30 రోజుల్లో ప్రేమించడం ఎలా? అనే కాన్సెప్ట్ తో సాగుతుంది. ఈ స్కిట్టు లో యాంకర్ ప్రదీప్ తో పాటు రష్మి గౌతమ్ కూడా జాయిన్ అవుతారు. అయితే స్కిట్ లో భాగంగా రష్మి గౌతమ్ ప్రదీప్ కు సుధీర్ గురించి చెబుతూ... 'ఒకడు నన్ను 7 ఏళ్లుగా ప్రేమిస్తున్నాడు. ఛీ కొట్టినా, చెప్పుతో కొట్టినా నా వెంట పడటం మాత్రం మానేయడం లేదు. చివరికి తూ అని మొహం మీద ఊసిన ఫేస్ ప్యాక్ అనుకోని రుద్దుకుంటాడు', అని అంటుంది.



ఐతే రష్మీ గౌతమ్ సుధీర్ పై చేసిన ఈ వ్యాఖ్యలు నొప్పించే విధంగా ఉన్నాయని సుధీర్ అభిమానులు తన బాధను వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనా స్కిట్ తరువాత భాగంలో వీరిద్దరి మధ్య జరిగిన రెండు మూడు నిమిషాల సన్నివేశాలు హాట్ టాపిక్ గా మారాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: