సాధారణ మనిషి ఏ ఘనత సాధించినా పట్టించుకోని ఈ సమాజం.. సెలిబ్రిటీ తుమ్మినా, దగ్గినా దాన్ని బూతద్దంలో పెట్టి చూపిస్తుంది.. సరిగ్గా అలాంటి ఘటనే జరిగిందిక్కడ! rrr మూవీ బ్యూటీ ఆలియా భట్ ఫోన్ వాల్‌పేపర్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈరోజు ఉదయం ముంబయిలో ‘గిల్టీ’ అనే వెబ్ సిరీస్ చూసేందుకు ఆలియా ఓ మల్టీప్లెక్స్ కడకు రావడంతో ఈ సంఘటన వెలుగు చూసింది.

 

IHG

 

ఆ తరుణంలో ఆలియాను ఫొటోలు తీస్తున్న సదరు ఫొటోగ్రాఫర్లు, ఆమెపై కాకుండా ఆమె ఫోన్ పై వున్న వాల్‌పేపర్‌ను కాన్సంట్రేట్ చేసి, జూమ్ చేసి మరీ ఫొటోలు క్లిక్‌మని అనిపించడంతో ఈ విషయం వెల్లడయ్యింది. మరికొందరైతే వీడియోలు కూడా తీసారు. వాల్‌పేపర్‌లో ఆలియా ఎవరికో ముద్దుపెడుతున్నట్లుగా అందులో వుంది. ఇపుడు అదే పెద్ద రచ్చ అయింది సోషల్ మీడియాలో. అయితే ఫ్యాన్స్ మాత్రం అది కచ్చితంగా రణ్‌బీర్ కపూరే అంటున్నారు.

 

రణ్‌బీర్ సోదరుడు అర్మాన్ వివాహ వేడుకలో తీసిన ఫొటో అని కొందరు కామెంట్స్ పెడుతున్నారు. అదే పెళ్లి వేడుకలో ఆలియా, రణ్‌బీర్ ముద్దు పెట్టుకున్నారని, ఆ ఫొటోనే ఆలియా వారి ప్రేమకు గుర్తుగా వాల్‌పేపర్‌గా పెట్టుకున్నారని కొందరు వాదిస్తున్నారు. ఇక ఆలియా, రణ్‌బీర్ దాదాపు ఏడాదిగా డేటింగ్‌లో ఉన్నారు. ఇద్దరూ ఈ విషయాన్ని ఒప్పుకోలేదు కానీ, విషయం కాస్త పెళ్లి వరకు వెళ్లినట్లు బాలీవుడ్ తాజా గుస గుసలు. 

 

IHG

 

ఆలియాను కోడలిగా చేసుకోవడం రణ్‌బీర్ ఇంట్లో వారికి కూడా ఇష్టమే అన్న సంగతి అందరికి విదితమే. వీరిద్దరూ కలిసి నటించిన ‘బ్రహ్మా్స్త్ర’ సినిమా క్రిస్మస్‌కు రిలీజ్ అవుతోంది. ఆ తర్వాత వీరి పెళ్లి చేయాలని వారి  కుటుంబ సభ్యులు నిర్ణయించుకున్నారని ఆనోటా.. ఈనోటా.. వినికిడి. దీని గురించి మీడియా ఆలియాను ప్రశ్నించగా.. తన పెళ్లి గురించి రోజుకో కొత్త తేదీ వినిపిస్తోందని.. ఇలాంటి వార్తలను నేను చాలా ఎంజాయ్ చేస్తానని... కొంచెం కొంటెగా ఆన్సర్ ఇవ్వడం కొసమెరుపు.

మరింత సమాచారం తెలుసుకోండి: