ఇటీవల మెగాస్టార్ చిరంజీవి ఉగాది పండుగ సందర్భంగా సోషల్ మీడియాలోకి అడుగు పెట్టిన సంగతి అందరికీ తెలిసిన విషయమే. మొదటి రోజు నుంచే ట్విట్టర్ ఖాతాలో చాలా యాక్టివ్ గా ఉంటూ కరోనా వైరస్ ను అరికట్టేందుకు అవగాహన కల్పించేలాగా ఎప్పుడూ ఏదో ఒక పోస్టు పెడుతూనే ప్రజలకు దగ్గరవుతున్నారు అనే చెప్పాలి. అంతేకాకుండా అప్పుడప్పుడు తన కుటుంబ సభ్యులతో దిగిన ఫోటోలను, సినిమా పాటల విషయాలని కూడా షేర్ చేస్తూ ఉన్నారు. ఇది ఇలా ఉండగా మరోవైపు సోషల్ మీడియాలో  తనని కొం తమంది ట్రోల్ చేస్తున్నారని వారిని అసలు నేను పట్టించుకోను అని అని తెలియచేసారు మెగాస్టార్.


ఇక అసలు విషయానికి వస్తే... ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న చిరు సోషల్ మీడియాలో ట్రోలింగ్ ఎక్కువ అయింది కదా... ఈ విషయంపై మీరు ఎలా స్పందిస్తారు అంటూ ఒక యాంకర్ చిరంజీవిని ప్రశ్నించగా... అందుకు చిరు సమాధానం ఇస్తూ తనదైన రీతిలో పంచ్ వేశాడు అనే చెప్పాలి. ఎప్పుడైనా ట్రోల్స్ అనేది కాస్త నవ్వుకునేలా గా ఉండాలి కానీ నవ్వులపాలయ్యే లాగా అసలు ఉండకూడదు అని చిరు తెలిపాడు. అలాగే నా వద్దకు కొన్ని టోన్స్ కూడా వచ్చాయి. ఆ ట్రోల్స్ గురించి ఆలోచించినా అరుదైన సమయాన్ని నేను వేస్ట్ చేసుకోకూడదు అని నిర్ణయించుకున్నాను. 

 


సోషల్ మీడియాలో ఎప్పుడు ట్రోల్స్ చేసే వారిని ఎప్పటికీ మారారు అంటూ, చిరు అలాంటి వాళ్ళని పట్టించుకోకుండా ఉండడమే చాలా మంచిది అంటూ తెలిపాడు. అసలు ఇలాంటి వారి గురించి మాట్లాడుకోవడం పెద్ద టైం వేస్ట్ అండ్ వారిని ఏం అనలేం అంటూ గట్టి పంచ్ ఇచ్చాడు చిరు. ఎప్పటికప్పుడు తన అప్డేట్ సోషల్ మీడియా ద్వారా తెలియజేస్తూ అభిమానులను ఆకట్టుకున్నాడు అనే చెప్పాలి మెగాస్టార్ చిరు.

మరింత సమాచారం తెలుసుకోండి: