ఇండియన్ సినిమా చరిత్రలో అత్యంత వివాదాస్పద ప్రేమ కథ సావిత్రి జెమిని గణేషన్ ది. సావిత్రి ఇండియన్ ఫిలిం లేడీ సూపర్ స్టార్ అయినా సరే ఆయన ప్రేమలో పడటం ఆయనను పెళ్లి చేసుకోవడం అన్నీ కూడా అప్పట్లో ఒక సంచలనంగా నిలిచాయి. వీరి వివాహానికి ఎందరో అడ్డు చెప్పినా సరే వాళ్ళు మాత్రం ఎక్కడా కూడా వెనకడుగు వేయలేదు. సావిత్రి కి ఇమేజ్ ఎక్కువ అయినా సరే జెమిని విషయంలో ఆమె ఎవరి మాట కూడా లెక్క చేసిన పరిస్థితి అనేది లేకుండా పోయింది. వీరి కాంబినేషన్ లో తమిళంలో ఎన్నో సినిమాలు వచ్చాయి. 

 

వాటిల్లో ఎక్కువ భాగం హిట్ అయినవే ఉన్నాయి. అయితే వీరు వివాహం చేసుకోవడం అప్పట్లో చాలా మందికి నచ్చలేదు. సావిత్రికి అసలు అతను వద్దు అని ఎందరో చెప్పారు అప్పటికే పెళ్లి జరగడం ప్రేమ వ్యవహారాలూ ఉండటం తో అతన్ని చాలా మంది తీవ్రంగా వ్యతిరేకించిన సందర్భాలు ఉన్నాయి. సావిత్రి జీవితం నాశనం అవుతుందని ఎందరో ఆవేదన వ్యక్తం కూడా చేసారు. అయినా సరే ఆమె మాత్రం వెనకడుగు వేయలేదు. ఆమె ఆస్తి మీద అతను కన్నేశాడు అనేది చాలా మంది అప్పట్లో చెప్పే మాట. 

 

ఆ తర్వాత వీళ్ళు విడిపోవడం చివర్లో సావిత్రి ఒంటరి గా చనిపోవడం వంటివి ఆందోళన కలిగించాయి. సావిత్రి జీవితంలో నటిగా ఎన్నో విజయాలను చూసినా జెమిని విషయంలో మాత్రం ఆమె వేసిన అడుగులు ఆమె జీవితాన్ని బాగా వెనక్కు లాగేసాయి అనేది ఎవరూ కాదనలేని వాస్తవం. ఆమె పెళ్లి చేసుకున్న తర్వాత సినిమాల్లో క్రమంగా వెనక్కు తగ్గుతూ వచ్చారు. ఒకానొక సమయంలో ఆమె సినిమాలకు దూరం అవుతుందా అని కూడా భావించారు. అయినా సరే సినిమాల్లో ఆమె నిలబడింది రాణించింది. ఆమె జీవిత౦ విషాదంగా ముగిసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: