మన తెలుగులో ముందు నుంచి కూడా హీరోయిన్ ల విషయంలో కొందరు మరీ దారుణంగా ప్రవర్తిస్తూ ఉంటారు అనే ఆరోపణలు వినపడుతూ ఉంటాయి. హీరోయిన్ లు చాలా మంది అవకాశాల కోసం పడే కష్టాలు అన్నీ ఇన్ని కాదు అనేది వాస్తవం. ఒక స్టార్ హీరో సినిమాలో నటించాలి లేదా అవకాశం రావాలి అంటే హీరోయిన్ పడే కష్టం ఆమెకు మాత్రమే తెలుసు అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.  అస‌లు హీరోయిన్ కెరీర్ ఆరంభంలో నిల‌దొక్కు కునేందుకు ఎన్ని అష్ట‌క‌ష్టాలు ప‌డ‌తారో ?  ఆ స్టేట‌స్ కోసం ఎంత రిస్క్ చేస్తారో ?  తెలిసిందే. ఒక‌సారి స్టార్ స్టేట‌స్ వ‌చ్చాక ఏ హీరోయిన్ కు అయినా వ‌రుస పెట్టి ఛాన్సులు వ‌స్తాయి. అయితే అప్ప‌టి వ‌ర‌కు మాత్రం ఎంతో క‌ష్ట‌ప‌డాలి.

 

ఇప్పుడు కరోనా లాక్ డౌన్ సమయంలో హీరోయిన్ లు మరింత దారుణంగా తయారు అయింది అని అంటున్నారు. ఇది నిజం కూడా ఓ మోస్త‌రు.. మీడియం రేంజ్ హీరోయిన్లకు వ‌చ్చిన  ఛాన్సులు కూడా వెన‌క్కి వెళ్లిపోతోన్న ప‌రిస్థితి. ఈ క్ర‌మంలోనే వారు అవ‌కాశాల కోసం నిర్మాత‌ల‌ను బ‌తిమి లాడుకునే ప‌రిస్థితి వ‌చ్చింది. వారి పరిస్థితి ని చూసిన కొందరు నిర్మాతలు వారి గురించి మరీ అవమానంగా మాట్లాడుతున్నారు అనే వార్తలు వస్తున్నాయి. ఒక హీరోయిన్ కోసం ఒక నిర్మాత ఆరు నెలల కోసం తీవ్రంగా ప్రయత్నాలు చేశారు. ఆమె ఇప్పుడు అతన్ని సినిమా ఛాన్స్ ఇవ్వ‌మ‌ని అడిగింద‌ట‌.

 

కాని ఆమెను అతను నీచంగా మాట్లాడటమే కాదు ఆమెకు అవకాశం ఇవ్వాలి అంటే కొన్ని షరతులను కూడా పెట్టాడు అని సమాచారం. ఈ విషయాన్ని ఆమె ఎవరికి చెప్పుకోవాలో అర్ధం కాక కన్నీరు పెట్టుకుంద‌న్న టాక్ ఇండ‌స్ట్రీ వ‌ర్గాల్లో వైర‌ల్ అవుతోంది. ఈ బాధ ఈ ఒక్క హీరోయిన్ దే కాదు చాలా మంది హీరోయిన్ ల పరిస్థితి ఇదే విధంగా ఉంది అనే వార్తలు మాత్రం ఈ మధ్య ఎక్కువగా వినపడుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: