రాజమౌళి తో సినిమా అనగానే అంత ఈజీ గా ఉండదు అనే సంగతి తెలిసిందే. ఆయన తో సినిమా చెయ్యాలి అంటే కచ్చితంగా వేరే సినిమాలను వదులుకోవాల్సి ఉంటుంది. అగ్ర హీరో అయినా చిన్న హీరో అయినా సరే ఆయన తో సినిమా అంటే వేరే సినిమాల ఆలోచన కూడా చేయకుండా ఉండాలి. ఆయన తో ఎన్ని రోజులు సినిమా  చేసినా సరే అదే విధంగా ఉండాల్సిన అవసరమా ఏంది ఉంటుంది. ఇప్పుడు మాత్రం ఆ విషయంలో టాలీవుడ్ లో ఇతర దర్శకులు ఆగ్రహంగా ఉన్నారు అనే వార్తలు వస్తున్నాయి. ఆవును అతని విషయంలో వేరే దర్శకులు సీరియస్ గా ఉన్నారు అని టాక్. 

 

దానికి కారణం ఏంటీ అంటే త్రివిక్రమ్ తో సినిమా  చేయడానికి తారక్ ప్రయత్నాలు చేస్తున్నాడు. అతను యెప్పుదుఒ ఈ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమాను ఎప్పుడు మొదలు పెడతారు అనేది కూడా చెప్పలేని పరిస్థితి ఉంది. ఇక ఇప్పుడు రామ్ చరణ్ కూడా రాజమౌళి దగ్గర ఆగిపోయాడు. ఇద్దరు హీరోలు కూడా ఈ విధంగా ఆగిపోవడం తో ఇతర దర్శక  నిర్మాతలు  మాత్రం బాగా ఇబ్బంది పడుతున్నారు అనే చెప్పాలి. వారి తో సినిమాలు చెయ్యాలి అనుకునే వాళ్ళు అందరూ కూడా ఇప్పుడు తమ సినిమాలను వాయిదా వేసుకుంటున్నారు. 

 

ఇక చిరంజీవి కూడా రాజమౌళి విషయంలో ఆగ్రహంగా ఉన్న సంగతి తెలిసిందే. మరీ ఇన్ని రోజులు ఒక ప్రాజెక్ట్ కోసం ఎదురు చూడాలి అంటే కచ్చితంగా కష్టమవుతుంది అని అది ఇబ్బంది గా మారుతుంది అని చెప్పారట.  ఆర్ఆర్ఆర్ షూటింగ్ అవడానికి కనీసం ఏడాది పట్టే సూచనలు ఉన్నాయి. అప్పటి వరకు ఎన్టీఆర్ రామ్ చరణ్ ఇద్దరూ కూడా వేరే సినిమా షూటింగ్ కి వెళ్ళే అవకాశం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: