తెలుగు చిత్ర పరిశ్రమలో చాలానే ప్రేమ జంటలు ఉన్న విషయం తెలిసిందే. తెలుగు చిత్ర పరిశ్రమలో ఓ రేంజిలో క్రేజ్ సంపాదించుకున్న నటి మణులు తమతో పాటు నటించిన సహ నటుడుని పెళ్లి చేసుకుని ఆ తర్వాత సెటిల్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇలా సహనటున్ని పెళ్లి చేసుకుని ఆ తర్వాత కెరీర్ పరంగా సెటిల్ అయిన హీరోయిన్లలో ఒకరు ఊహ. ఊహ అప్పట్లో స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలిగిన విషయం తెలిసిందే. ఎంతో మంది స్టార్ హీరోల సరసన నటించింది ఊహ. అప్పట్లో తెలుగు ప్రేక్షకులను ఎంతగానో అలరించింది ఊహ. తన అందం అభినయంతో ఎంతగానో ఆకట్టుకుంది. అయితే హీరోయిన్ గా కెరీర్ మంచి స్థాయిలో ఉన్న సమయంలోనే ప్రేమ వివాహం చేసుకుంది.
టాలీవుడ్ హీరో సహ నటుడు అయిన శ్రీకాంత్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది ఊహ. వీరిద్దరి జంట ఇప్పటికికూడా తెలుగు చిత్ర పరిశ్రమలో ఎవర్ గ్రీన్ గా నిలుస్తుంది . అయితే ఊహ వివాహం తర్వాత పూర్తిగా సినిమాలకు దూరమై పోయింది అనే చెప్పాలి. కుటుంబ బాధితులతో ఇంట్లోనే ఉండిపోయింది ఊహ. ఇక హీరో శ్రీకాంత్ ఆ తర్వాత మంచి క్రేజ్ సంపాదించుకుని అంచెలంచెలుగా ఎదిగారు. ఊహ మాత్రం పెళ్లి తర్వాత కుటుంబాన్ని ఎంతో బాధ్యతాయుతంగా ముందుకు నడిపించింది అనే చెప్పాలి. వీరిద్దరి ప్రేమకు గుర్తుగా రోహన్ రోషన్ అనే ఇద్దరు పిల్లలు కూడా పుట్టారు.
ఇక పెళ్లి తర్వాత ఎంతో బాధ్యతాయుతంగా కుటుంబ బాధ్యతలను నడిపించింది ఊహ. ఓ వైపు శ్రీకాంత్ చిత్ర పరిశ్రమలో ఎంతో బిజీగా ఉండడంతో... పిల్లల ఆలనా పాలనా చూసుకుంటూ అన్ని వ్యవహారాలను చూసుకుంది ఊహ. అయితే ఊహ మొదటి అబ్బాయి రోహన్ ను హీరోగా కూడా పరిచయం చేసిన విషయం తెలిసిందే. తెలుగు చిత్ర పరిశ్రమలో ఓ సినిమాతో రోహన్ హీరోగా పరిచయమై మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. ఇలా హీరోయిన్ ఊహ కెరియర్ పీక్స్ లో ఉన్న సమయంలోనే శ్రీకాంత్ తో ప్రేమలో పడి వివాహం చేసుకుని ఆ తర్వాత సెటిల్ అయింది అని చెప్పాలి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి