బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో యువ హీరో సుశాంత్ సింగ్ మరణం పెను ప్రకంపనలు సృష్టించిన విషయం తెలిసిందే. ఎంతో కష్టపడి ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరో ఒక్కసారిగా ఆత్మహత్య చేసుకోవడం పెద్ద సంచలనం గా మారిపోయింది. సుశాంత్ సింగ్ ఆత్మహత్యకు కారణం ఏమిటి అనే విషయం అందరి మనసులను తొలి చేసింది. అయితే మానసిక ఒత్తిడికి లోనై సుశాంత్  ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు అని  వైద్యులు నిర్ధారించారు. సుశాంత్ సింగ్ ఆత్మహత్య చేసుకుని అకాల మరణం చెందడం బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో సరికొత్త వివాదాన్ని తెరమీదకు తెచ్చింది. చిత్ర పరిశ్రమలో బంధుప్రీతి ఎక్కువగా ఉందని.. నెపోటిజం వల్లే  ఎలాంటి బ్యాగ్రౌండ్ లేని యువ నటులను  తొక్కేస్తున్నారు అంటూ కొంతమంది బాహాటంగానే విమర్శలు చేశారు. 

 

 దీనిపై పోలీసులు విచారణ జరిపి ఏకంగా సుశాంత్ సింగ్ రాజ్ పుత్ యొక్క స్నేహితులు తల్లిదండ్రులు సుశాంత్ గర్ల్ ఫ్రెండ్ ను కూడా విచారించి స్టేట్మెంట్ సేకరించిన విషయం తెలిసిందే. అయితే ఇటీవల సుశాంత్ గర్ల్ ఫ్రెండ్ రియా చక్రవర్తి సుశాంత్ మరణంపై సిబిఐ విచారణ జరిపించాలంటూ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు ప్రత్యేక లేఖ రాసిన విషయం తెలిసిందే. అయితే రియా చక్రవర్తి సుశాంత్ కేసును సీబీఐకి అప్పగించాలని లేఖ రాయటం ఎన్నో అనుమానాలకు తావిచ్చింది. మొన్నటివరకు సైలెంట్ గా  ఉన్న రియా చక్రవర్తి ఒక్కసారిగా సుశాంత్ కేసును సీబీఐకి అప్పగించాలి కోరటం పెద్ద  దుమారమే రేగింది. 

 


 ఇదిలా ఉంటే మరో వైపు సుశాంత్ మరణానికి  రియా చక్రవర్తి కూడా కారణం అంటూ సోషల్ మీడియాలో ప్రచారం కూడా జరుగుతోంది. ఈ క్రమంలోనే సుశాంత్ సింగ్ అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక రోజుకు రోజుకు ప్రియా చక్రవర్తికి బెదిరింపులు ఎక్కువైపోయి.ఈ  నేపథ్యంలో రియా చక్రవర్తి పోలీసులకు కంప్లైంట్ చేశారు. సోషల్ మీడియా వేదికగా తనను  చంపేస్తానని అత్యాచారం చేస్తానని బెదిరింపులకు పాల్పడుతున్నారని  ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు  నిందితులపై  కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు పోలీసులు.

మరింత సమాచారం తెలుసుకోండి: