సూపర్ స్టార్ మహేష్ బాబు అతి త్వరలో తన లేటెస్ట్ మూవీ సర్కారు వారి పాట షూటింగ్ లో పాల్గొననున్నారు. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించనున్న ఈ సినిమాలో మహేష్ బాబు ఒక డిఫరెంట్ రోల్ లో కనిపంచనుండగా, గీతా గోవిందం దర్శకుడు పరశురామ్ పెట్ల ఈ సినిమాని తెరకెక్కించనున్నాడు. 14 రీల్స్ ప్లస్, జిఎంబి ఎంటర్టైన్మెంట్స్, మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్స్ పై ఎంతో భారీ లెవెల్లో తెరకెక్కనున్న ఈ సినిమాకు ఎస్. ఎస్. థమన్ సంగీతాన్ని అందించనున్నాడు. ఇక దీని తరువాత దర్శక దిగ్గజం రాజమౌళి తో మహేష్ బాబు ఒక సినిమా చేయనున్న విషయం తెలిసిందే. కె. ఎల్. నారాయణ నిర్మాతగా దుర్గా ఆర్ట్స్ బ్యానర్ పై అత్యంత భారీ లెవెల్లో, హై టెక్నీకల్ వాల్యూస్ తో తెరకెక్కనున్న ఈ సినిమాని వచ్చే ఏడాది ద్వితీయార్ధంలో మొదలెట్టే అవకాశం కనపడుతోంది.
![]()
ఇప్పటికే మహేష్ మూవీ విషయమై తన తండ్రి విజయేంద్రప్రసాద్ తో కలిసి పలు కథా చర్చల్లో పాల్గొన్న రాజమౌళి, అదిపోయే స్క్రిప్ట్ ని రెడీ చేయమని చెప్పారట. కాగా వీరిద్దరి కాంబోలో జేమ్స్ బాండ్ తరహా సినిమా రూపొందనున్నట్లు ఇటీవల కొద్దిరోజలుగా వార్తలు వస్తున్నాయి. ఇక అసలు మ్యాటర్ ఏంటంటే, కేవలం ద్విభాషా సినిమా స్పైడర్ర్ తప్పించి, ఇప్పటివరకు వేరొక భాషలో సినిమా చేయని సూపర్ స్టార్ మహేష్ కు, బాలీవుడ్ సహా మిగతా అన్ని రాష్ట్రాల్లో మంచి క్రేజ్ ఉంది. అటు తమిళ్ కూడా డబ్బింగ్ కాబడ్డ పలు మహేష్ సినిమాలు మంచి కలెక్షన్స్ ని, టెలివిజన్ రేటింగ్స్ ని దక్కించుకున్నాయి.
ఇక బాలీవుడ్ విషయం అయితే చెప్పనక్కర్లేదు, అక్కడి ఎందరో హీరోయిన్లు మహేష్ తో ఒక్క సినిమా ఛాన్స్ కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు. మరోవైపు ఇటీవల బాహుబలి రెండు భాగాల గొప్ప విజయాలతో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న రాజమౌళి క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కాగా, అతి త్వరలో వీరిద్దరూ కలిసి చేయబోయే ఈ మూవీ, కేవలం తెలుగు మాత్రమే కాకుండా అటు నార్త్ లో కూడా పలు రికార్డ్స్ క్రియేట్ చేయడం ఖాయం అని, బాబు దెబ్బకు అన్ని రికార్డులు మటాషే అని పలువురు సూపర్ స్టార్ ఫ్యాన్స్ తమ సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా కామెంట్స్ చేస్తూ అభిప్రాయపడుతున్నారు....!!
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి