యంగ్
రెబల్ స్టార్ ప్రభాస్ ఆదిపురుష్ గా నటిస్తున్న చిత్ర
పోస్టర్ ను రిలీజ్ చేసి
బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ సినీ ప్రేక్షకులందరినీ ఆశ్చర్యపరిచారు. ఆదిపురుష్
పోస్టర్ రిలీజ్ కు ముందురోజు సామాజిక మాధ్యమంలో
రెబల్ స్టార్ ప్రభాస్ బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ ఆసక్తికర చర్చ జరిపారు. ఆ చర్చలో సిద్ధంగా ఉన్నారా
ప్రభాస్ అని ఓం రౌత్ అడుగగానే యంగ్
రెబల్ స్టార్ సిద్ధంగా ఉన్నట్లు చెబుతారు. మరుసటి రోజు ఆదిపురుష్ చిత్రానికి సంబంధించిన
పోస్టర్ రిలీజ్ చేశారు ఓం రౌత్.
ప్రభాస్ ఫ్యాన్స్ థ్రిల్లింగ్ కు గురయ్యారు. ఇందులో
ప్రభాస్ రాముడిగా నటిస్తున్నారని హాట్ హాట్ గా చర్చ ఇప్పటికీ కొనసాగుతున్నది. రావణుడిగా
సైఫ్ అలీఖాన్ నటిస్తున్నారని తెలుస్తోంది. ఓం రౌత్ దర్శకత్వం వహించిన తానాజీ చిత్రంలో విలన్ గా
సైఫ్ అలీఖాన్ నటించారు. ఆదిపురుష్ లోను సైఫే విలన్ గా నటిస్తున్నారని సామాజిక వేదికగా రూమర్స్ వినిపిస్తున్నాయి. సీతగా
మహానటి ఫేం
కీర్తి సురేష్ నటించబోతున్నారని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. కానీ ఏ ఒక్కరి నుంచి అఫీషియల్ గా అనౌన్స్ చేయకపోవడం విశేషం.
ఆదిపురుష్ చిత్రంతోపాటు మరొక
బాలీవుడ్ క్రేజీ ప్రాజెక్టులోబాహుబలి
హీరో యంగ్
రెబల్ స్టార్ ప్రభాస్ చేయనున్నారని తెలుస్తోంది. ఇప్పటికే ఆదిపురుష్ ద్వారా డైరెక్టుగా
హిందీ చిత్రంలో నటిస్తున్నారు ప్రభాస్. దీంతో ఆయనకు మరొక అవకాశం చేజిక్కించుకున్నారని
బాలీవుడ్ మీడియా ప్రచారం చేస్తున్నది. అదేమిటంటే ప్రముఖ
నిర్మాత ఆదిత్య చోప్రా నిర్మించబోతున్న చిత్రంలో
ప్రభాస్ నటించనున్నారని తెలిసింది. ఈ చిత్రంలో
బాలీవుడ్ సూపర్ స్టార్ హృతిక్ రోషన్ నటిస్తున్నారు. ప్రస్తుతం
ప్రభాస్ రాధేశ్యామ్ లో నటిస్తున్నారు.
జిల్ ఫేం దర్శకుడు
రాధాకృష్ణ కుమార్ డైరెక్షన్ చేస్తున్నారు.
అల వైకుంఠపురములో ఫేం
హీరోయిన్ గా
పూజా హెగ్గె నటిస్తున్నారు.
లవ్ స్టోరీ అని చిత్ర
పోస్టర్ చూస్తుంటే అర్థమవుతుంది. ఈ
సినిమా 2021లో రిలీజ్ కానుంది. ఈ చిత్రం తర్వాత
మహానటి ఫేం
నాగ్ అశ్విన్ చిత్రంలో నటించనున్నారు ప్రభాస్.