చిన్న హీరో ని ఎంకరేజ్ చేసిన మెగా హీరో వరుణ్ తేజ్..?విజ‌యీభ‌వ ఆర్ట్స్ ప‌తాకం పై ప్రవీణ్ పగడాల, బోసుబాబు నిడుమోలు, ఆనంద్ రెడ్డి మద్ది, మనోహర్ రెడ్డి యెడ నిర్మిస్తున్న చిత్రం బొమ్మ ‌బ్లాక్ బ‌స్ట‌ర్. నూత‌న ద‌ర్శ‌కుడు రాజ్ విరాట్ డైరెక్ష‌న్ లో తెర‌కెక్కుతున్న ఈ సినిమాలో యంగ్ టాలెంటెడ్ హీరో విజయ్ శ్రీకృష్ణ‌(నందు), డ‌స్కీ బ్యూటీ రష్మీ గౌతమ్ జంట‌గా న‌టిస్తున్నారు.

ముందుగా టైటిల్ ఆ త‌రువాత విడుద‌ల చేసిన టీజ‌ర్ తో అటు ఆడియెన్స్ లో ఇటు ఇండ‌స్ట్రీ వ‌ర్గాల్లో అనూహ్య స్పంద‌న అందుకున్నారు బొమ్మ బ్లాక్ బ‌స్ట‌ర్ చిత్ర యూనిట్. ఈ నేప‌థ్యంలోనే నేడు బొమ్మ బ్లాక్ బ‌స్ట‌ర్ చిత్రం ఆడియో ఆల్బ‌మ్ నుంచి  రాయే నువ్వు రాయే అనే పాట‌ను మెగా ప్రిన్స్ వ‌రుణ్ తేజ్ గారు ట్విట్ట‌ర్ ద్వారా విడుద‌ల చేశారు.

ఇక ఈ సినిమాలో నందు ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు పూరీజ‌గ‌న్నాథ్ ఫ్యాన్ గా న‌టిస్తున్నాడు, నందు పోషించిన పోతురాజు పాత్ర వైవిధ్యంగా ఉండ‌బోతుంద‌ని, నందు పాత్ర‌కు ధీటుగా ర‌ష్మీ గౌత‌మ్ పాత్ర కూడా ఉండ‌బోతుంద‌ని చిత్ర బృందం చెబుతోంది. ఈ చిత్రం షూటింగ్ తో పాటు అన్ని కార్య‌క్ర‌మాలు పూర్తి చేసుకొని  విడదులకు సిద్ధంగా ఉందని చిత్ర నిర్మాత‌లు ప్రవీణ్ పగడాల, బోసుబాబు నిడుమోలు, ఆనంద్ రెడ్డి మద్ది, మనోహర్ రెడ్డి యెడ తెలిపారు. ల‌హ‌రి మ్యూజిక్ ద్వారా ఈ సినిమా ఆడియో అందుబాట‌లో ఉంది. పలు చిత్రాలలో హీరో గా నటించిన నందు సవారి లాంటి సూపర్ హిట్ సినిమ తర్వాత చేస్తున్న ఈ సినిమా పై మంచి అంచనాలు నెలకొన్నాయి..


Happy to release the first single #RaayeNuvRaaye from #BommaBlockbuster
Music by @prashanthvihari https://t.co/8L8b6YhBIe

All the best to the entire team
Wish you all a big success.
👍🏽👍🏽👍🏽@ActorNandu @rashmigautam27@vijaieebhava @RajVirat_G @LahariMusic

varun Tej konidela 🥊 (@IAmVarunTej) October 19, 2020 ' data-card-branding='0' class='embedly-card'>">

న‌టీన‌టులు

నందు విజయ్ కృష్ణ‌, ర‌ష్మీ గౌత‌మ్

సాంకేతిక వ‌ర్గం

పీ.ఆర్.ఓ : ఏలూరు శ్రీను

పబ్లిసిటీ డిజైన్స్ : ధని ఏలే

ఎడిటర్ : బి. సుధాకర్

సినిమాటోగ్రఫీ : సుజాతా సిద్ధార్థ్

మ్యూజిక్ : ప్రశాంత్ ఆర్. విహారి

నిర్మాతలు : ప్రవీణ్ పగడాల, బోసుబాబు నిడుమోలు, ఆనంద్ రెడ్డి మద్ది, మనోహర్ రెడ్డి యెడ

రచన - దర్శకత్వం : రాజ్ విరాట్

https://youtu.be/fTbWTl485Ow 

మరింత సమాచారం తెలుసుకోండి: