టాలీవుడ్ హీరోయిన్ సమంత సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుందన్న సంగతి తెలిసిందే. ఎప్పటికప్పుడు తన వ్యక్తిగత ఫోటోలు అలాగే తన భర్త కు సంబంధించిన ఫోటోలను షేర్ చేస్తూ అభిమానులలో ఆసక్తిని పెంచుతుంది. నిన్న నాగ చైతన్య పుట్టిన రోజు కావడంతో ఆయన పుట్టినరోజుని  జాలిగా గడిపేందుకు ఈ జంట మాల్దీవ్స్ కు వెళ్లారు. అక్కడ ఉన్న అందమైన బీచ్లలో, బీచ్ రిసార్ట్ లో సందడి చేస్తోంది ఈ జోడి. అక్కడ రిలాక్స్ అవుతూ అక్కడ తాము ఉన్న ఫోటోలను సోషల్ మీడియా ఫ్లాట్ ఫార్మ్ లలో షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తోంది సమంతా.  

మొన్న సముద్రం లోపలికి డైవ్ చేస్తున్నట్లు ఉన్న పిక్స్ వైరల్ గా గా నిన్న నాగ చైతన్య చొక్కా లేకుండా షార్ట్ తో నడుచుకుంటూ వెళుతున్న ఫోటోలు షేర్ చేసిన సమంత తమ టూర్ మీద మరింత ఆసక్తి రేకెత్తిస్తోంది. ‘ఎప్పుడు జీవితాన్ని నీ లెక్కల ప్రకారమే బతుకుతావు’ ఇక ముందు కూడా అలాగే ఉండాలని కోరుకుంటున్నా అంటూ ఆమె ఈ పిక్ షేర్ చేసింది. ఆ తర్వాత పక్షి ఆకారంలో ఉన్న ఒక ఉయ్యాలలో పడుకొని ఫోటోలకు ఫోజులు ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ.
ఎప్పటిలానే గ్లామర్ ఒలకబోస్తూ కుర్రాళ్లను వేడెక్కిస్తోంది.  ఇక సినిమాల విషయానికి వస్తే నాగ చైతన్య ప్రస్తుతం లవ్ స్టోరీ అనే సినిమా చేస్తున్నాడు శేఖర్ కమ్ముల దర్శకత్వంలో సాయి పల్లవి హీరోయిన్ గా తెరకెక్కిన ఈ సినిమా షూటింగ్ భాగం పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ సినిమాని థియేటర్లు ఓపెన్ అయిన క్రమంలో రిలీజ్ చేసే అవకాశం కనిపిస్తోంది. మరో పక్క సమంత ఇప్పటి దాకా ఎలాంటి సినిమా అనౌన్స్ చేయలేదు. ప్రస్తుతం ఆమె ఒక పక్క బిజినెస్ తో మరోపక్క ఆహా యాప్ కోసం ఒక షో చేస్తూ బిజీగా ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: