బిగ్ బాస్ సీజన్ 4లో ఈటివి జబర్దస్త్ కమెడియన్ ముక్కు అవినాష్ ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. బిగ్ బాస్ సీజన్ 4లో అవినాష్ బెస్ట్ ఎంటర్టైనర్ గా ప్రేక్షకులను అలరిస్తున్నాడు. టాస్క్ ఏదైనా సరే అవినాష్ ఎంటర్టైన్ చేస్తూనే ఉంటాడు. జబర్దస్త్ నుండి బిగ్ బాస్ కు జరిగిన 3 సీజన్లలో ఎవరు రాలేదు. కాని ఈ సీజన్ లో అవినాష్ వచ్చి ఆ రికార్డ్ బ్రేక్ చేశాడు. హైపర్ ఆది అయితే జబర్దస్త్ లో బిగ్ బాస్ షో మీద పంచులు కూడా వేశాడు.

ఇదిలాఉంటే బిగ్ బాస్ సీజన్ 4 ముగింపు దశకు దగ్గరగా ఉంది. ఈ సీజన్ లో విన్నర్ గా నిలిచేందుకు హౌజ్ లో ఉన్న ఏడుగురు హౌజ్ మేట్స్ విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. అయితే అవినాష్ కు జబర్దస్త్ టీం నుండి ఊహించని విధంగా సపోర్ట్ అందుతుంది. జబర్దస్త్ లో స్టార్ కమెడియన్స్ అంతా కూడా అవినాష్ కు తమ సోషల్ మీడియా ఫ్లాట్ ఫాం ద్వారా ప్రమోట్ చేస్తున్నారు. హౌజ్ లో మా అవినాష్ బాగా ఆడుతున్నాడని అతనికి ఓట్లు వేయండని అంటున్నారు.

సుడిగాలి సుధీర్ టీం లో ఉన్న గెటప్ శ్రీను, ఆటో రాం ప్రసాద్ లు అవినాష్ కు సపోర్ట్ గా తమ సోషల్ మీడియాలో సపోర్ట్ చేస్తున్నారు. అవినాష్ కు ఓటేయమని బిగ్ బాస్ ఇచ్చిన టోల్ ఫ్రీ నంబర్ పోస్ట్ చేశారు. ఓ స్పెషల్ వీడియోని కూడా రిలీజ్ చేశారు. అవినాష్ కు సపోర్ట్ చేయండని గెటప్ శ్రీను, ఆటో రాం ప్రసాద్ చెబుతున్నారు.  అంతేకాదు డిస్నీ ప్లస్ హాట్ స్టార్ యాప్ లో కూడా అవినాష్ కు ఓటేయమని కోరుతున్నారు. బిగ్ బాస్ కు జబర్దస్త్ టీం ప్రమోషన్ వెరైటీగా ఉందని చెప్పొచ్చు.  



 

మరింత సమాచారం తెలుసుకోండి: