బిగ్ బాస్ సీజన్ 4లో 13వ వారం వచ్చేసింది. ప్రస్తుతం హౌజ్ లో సూపర్ సెవన్ ఉండగా వారిలో ఎవరు టాప్ 5, టాప్ 3 ఉంటారు ఫైనల్ విజేత అవుతారన్నది చాలా ఎక్సయిటింగ్ గా ఉంది. సోషల్ మీడియాలో అభిజిత్ విన్నర్ అని తేల్చేసి చెబుతున్నా మిగతా కంటెస్టంట్స్ కూడా హౌజ్ లో టఫ్ ఫైట్ ఇస్తున్నారు కాబట్టి వారికి కూడా విజేతగా నిలిచే ఛాన్స్ ఉందని చెప్పొచ్చు. ఇక మంగళవారం ఎపిసోడ్ లో టికెట్ టు ఫినాలే టాస్క్ ఇస్తున్నాడు బిగ్ బాస్.

ఈ టాస్క్ లో గెలిచిన వారు డైరెక్ట్ గా ఫైనల్స్ కు చేరుకుంటారు. అసలైన ఆట ఇదే అని చెప్పొచ్చు. అయితే హౌజ్ లో ఉన్న ఐదుగురు కంటెస్టంట్స్ లో టికెట్ టు ఫినాలే రేసులో మొదటి రౌండ్ లో నలుగురు హౌజ్ మేట్స్ టాస్క్ నుండి తప్పుకున్నట్టు తెలుస్తుంది. అభిజిత్, హారిక, అఖిల్, సోహెల్ ఈ టాస్క్ లో తర్వాత రౌండ్ కు ఫార్వాడ్ అయినట్టు తెలుస్తుంది. అరియానా, అవినాష్, మోనాల్ మొదటి రౌండ్ లోనే వెనుదిరిగారని తెలుస్తుంది.

అయితే టికెట్ టు ఫినాలే గెలిచేది ఒకరే కాని ఆ ఒక్కరు ఎవరన్నది మాత్రం టాస్క్ రిజల్ట్స్ ను బట్టి తెలుస్తుంది. ఇక టాస్కుల్లో సరిగా పర్ఫాం చేయడని అభిజిత్ మీద కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఈ టాస్క్ లో అభిజిత్ విన్ అయ్యి తను ఫిజికల్ టాస్కులు కూడా ఆడుతాడని ప్రూవ్ చేసుకుంటే బెటర్ అని అంటున్నారు.                                                                

మరింత సమాచారం తెలుసుకోండి: