దీపిక, రణ్‌వీర్‌సింగ్‌ల  పెళ్లయి రెండేళ్లయింది. ఏళ్లు గడుస్తున్నాయేగానీ.. దీపిక మాత్రం.. మాజీ ప్రియుడిని మర్చిపోలేకపోతోంది. రణ్‌బీర్‌ కపూర్‌ని మనసులోంచి.. మైండ్‌లోంచి డిలీట్‌ చేయలేకపోతోంది. మనసునుంచే కాదు.. ప్రొఫైల్‌ పిక్చర్‌ నుంచి కూడా వెళ్లలేకపోతోంది. ఫేస్‌బుక్‌.. ఇన్‌స్టాగ్రామ్‌.. ఫేస్‌బుక్‌లో దీపిక, రణ్‌బీర్‌ కపూర్‌ కలిసున్న ఫొటోలను ప్రొఫైల్‌ పిక్చర్‌గా పెట్టడంతో.. నెటిజన్లు ట్రో్ల్‌ చేస్తున్నారు.

బాలీవుడ్‌లో దీపిక, రణ్‌బీర్‌ కపూర్‌ల లవ్‌స్టోరీ లోకం దృష్టిలో ఫెయిల్‌ అయినా.. ఆమె మనసులో కంటిన్యూ అవుతూనే ఉంది. 'యే జవానీ.. హై దివానీ'లో కలిసి నటించిన ప్రేమలో పడ్డారు. బాలీవుడ్‌ బ్యూటిఫుల్‌ కపుల్‌ అన్నారు. దిష్టి తగిలిందో ఏమో.. విడిపోయారు. రణ్‌బీర్‌  సంగతి  ఎలా ఉన్నా.. దీపిక మాత్రం డిప్రెషన్‌లోకి వెళ్లిపోయింది. రణ్‌ వీర్‌సింగ్‌ ప్రేమతో మళ్లీ మామూలు మనిషి అయింది దీపిక.

దీపిక చాలాకాలం రన్‌వీర్‌తో ప్రేమలో విహరించినా.. పెళ్లి చేసుకోవడానికి టైం తీసుకుంది. రెండేళ్ల క్రితం ఈ ఇద్దరు ఒకటయ్యారు. సోషల్‌ మీడియాలో దీపిక ప్రొఫైల్‌ పిక్చర్‌లో రణ్‌బీర్‌ కనిపించడంతో.. నెటిజన్లు షాక్‌ అయ్యారు. మాజీ ప్రియుడిని మర్చిపోలేకపోతోందంటూ.. కామెంట్స్ పెడుతున్నాడు. ఔత్సాహికులు  ముందడుగు వేసి... దీపిక, రణ్‌వీర్‌ విడిపోతున్నారా? అంటూ ప్రశ్నిస్తున్నారు.

తన సోషల్‌ మీడియాలో దీపిక పెట్టిన ప్రొఫైల్‌ పిక్చర్‌ వెనకాల ఓ కారణం ఉంది. రన్‌బీర్‌తో నటించిన మూవీ 'తలాష్‌' రిలీజై ఐదేళ్లయింది. ఈ సందర్భంగా ప్రొఫైల్‌ పిక్చర్‌లో రణ్‌బీర్‌తో క్లోజ్‌గా వున్న స్టిల్‌ పెట్టింది దీపిక. ఎవరైనా.. హిట్‌ మూవీ ఏడాది అయినా.. ఐదు పదేళ్లయితే.. స్టిల్ పెట్టి ఆ జ్ఞాపకాలు పంచుకుంటారు. కానీ.. ఫ్లాప్‌ మూవీ స్టిల్‌ను ప్రొఫైల్‌ పిక్చర్‌గా పెట్టడంతో... రకరకాలుగా ట్రోల్‌ చేస్తున్నారు.

మొత్తానికి దీపిక పదుకొనే మాజీ ప్రియుడిని మర్చిపోలేకపోతోందా అనే సందేహాలు తలెత్తుతున్నాయి. దీపిక  ప్రొఫైల్‌ పిక్చర్‌గా తమాషా స్టిల్ మారిపోయింది. ఫ్లాప్‌ మూవీకి ఇంత సీన్‌ చేసింది ఎందుకంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి.





మరింత సమాచారం తెలుసుకోండి: