దర్శక ధీరుడు రాజమౌళి ఎంతో ప్రతిష్ఠాత్మకంగా రూపొందిస్తున్న సినిమా ఆర్ ఆర్ ఆర్. ఈ సినిమాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ లు కథానాయకులుగా నటిస్తున్నారు. వీరి కాంబినేషన్ లో ఈ ప్రముఖ డైరెక్టర్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా పట్ల అభిమానులు ఈ మూవీపై భారీ అంచనాలే పెట్టుకున్నారు. అయితే ఈ మూవీలో కథానాయిలుగా బాలీవుడ్ బ్యూటీ క్వీన్ అలియా భట్, హాలీవుడ్ సుందరి ఒలీవియా మొరిన్ లు నటించబోతున్నారని చిత్ర యూనిట్ ప్రకటించింది. ఈ బ్యూటీ క్వీన్ లతో ఈ సినిమాకు మరింత అందం వచ్చిందనే చెప్పుకోవచ్చు. అయితే ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ తుది దశకు వచ్చిందని సమాచారం.  కొన్ని రోజుల కిందట హైదరాబాద్ లో యాక్షన్ పార్ట్ ను 50 రోజుల పాటు చిత్రికరించి కంప్లీట్ చేసిన విషయం తెలిసిందే.

విప్లవ వీరులైన అల్లూరి సీతారామరాజు, కొమురం భీం జీవితాల స్ఫూర్తితో తెరకెక్కబోతోంది ఈ సినిమా. ఈ సినిమాలో అల్లూరి సీతారామరాజుగా చరణ్ నటిస్తున్నాడు. అలాగే కొముంరం భీం పాత్రలో జూనియర్ ఎన్టీఆర్ నటించనున్న సంగతి తెలిసిందే. అయితే ఈ మూవీకి సంబంధించిన క్లిప్స్ సోషల్ మీడియాలో ఇప్పటికే వైరల్ గా మారాయి. కేవలం హీరోలను, దర్శకుడిని చూసి సినిమాపై  అంచనాలు వేసిన ఈ హీరోల అభిమానులు ఇప్పుడు క్లిప్పింగ్స్ చూసి ఈ మూవీపై భారీ అంచనాలు పెట్టుకున్నారని తెలుస్తోంది. ఈ సినిమాపై బాక్సాపీస్ వద్ద కలెక్షన్లను కొల్లగొట్టడం ఖాయమనిపిస్తుంది. 

అయితే ఆర్ఆర్ఆర్ సినిమా షూటింగ్ ను అందమైన ప్రదేశానికి షిప్ట్ చేసినట్టు తెలుస్తోంది. అబ్బురపరిచే ప్రకృతి అందంతో మెరిసి పోయే మహాబలేశ్వర్ లోని కొన్ని ప్లేస్ లల్లో షూటింగ్ ను నిర్వహించారు. ఈ సినిమాలోని కొన్ని ముఖ్యమైన సన్నివేషాలకు షూటింగ్ జరుపుతున్నట్టు ఈ మూవీ యూనిట్ ట్విట్టర్ వేదికగా తెలిపింది. ఈ అంతేకాదండోయ్.. మహాబలేశ్వర్ లోని ఒక బ్యూటిఫుల్ ప్లేస్ లో తీసిన ఒక వీడియోను కూడా ట్విట్టర్ ద్వారా తెలిపింది. అయితే మహాబలేశ్వరంలోనే వారం రోజుల పాటు ఆర్ఆర్ఆర్ మూవీ షూటింగ్ జరుపుతున్నట్టు సమాచారం. ఇక్కడే కాకుండా పూణే ప్రాంతాల్లో కూడా షూటింగ్ నిర్వహిస్తున్నట్టు తెలుస్తోంది. ఏదైతేనేం మరి కొన్ని రోజుల్లో ఈ సినిమా తెరముందుకు రాబోతోందని తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: