
మెగా ప్రిన్సెస్ నిహారిక కొణిదెల, చైతన్య జొన్నలగడ్డతో మూడుముళ్ల బంధంలోకి అడుగుపెట్టింది. వీరి డ్రీమీ వెడ్డింగ్ సెరెమనీకి ఉదయ్ విలాస్ ప్యాలస్ వేదికగా నిలిచింది. అంగరంగవైభవంగా వీరి వివాహం జరిగింది. ఈ వెడ్డింగ్ కు మెగా ఫ్యామిలీ మొత్తం హాజరయ్యారు. పవన్ కళ్యాణ్ కూడా తన పిల్లలతో ఈ వేడుకకు హాజరయ్యాడు. స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్ ఈ వేడుకకు సంబంధించి కొన్ని ఫోటోస్ ను అలాగే ఫన్ మూమెంట్స్ ను షేర్ చేసుకున్నాడు.
ఈ వేడుకలో అల్లు అర్జున్ విజిల్ మూమెంట్ ను ఎంజాయ్ చేసినట్టు తెలుస్తోంది. ఈ వేడుకలో అల్లు వారి కుటుంబం అలాగే మెగా కుటుంబం యాక్టివ్ గా పాలుపంచుకున్నారు. ఈ పిక్చర్ లో అల్లు అర్జున్ విజిల్ వేస్తున్న ఫోజ్ అభిమానులను మెస్మరైజ్ చేస్తోంది.
ఇక నీహారిక, తన పెళ్లివేడుకలో రెడ్ శారీలో తళుక్కుమంది. గోల్డ్ ఎంబ్రాయిడరీతో మెరిసిపోయింది. గోల్డ్ ఎంబ్రాయిడరీ కలిగిన గ్రీన్ బ్లౌస్ తో కళకళలాడింది. ట్రెడిషనల్ టెంపుల్ జ్యువెలరీతో రాయల్ లుక్ తో నిహారిక ముగ్దమనోహరంగా కనిపించింది.
ఇక అల్లు అర్జున్ తిరిగి రాగానే "పుష్ప" సినిమా షూటింగ్ లో పాల్గొంటాడు. ఇందులో రష్మిక రాయలసీమ అమ్మాయి పాత్రలో విలక్షణమైన పాత్ర కనిపించనుంది. అల్లు అర్జున్ ఈ సినిమాలో ఊర మాస గెటప్ లో అలరించనున్నాడు. ఇదివరకెప్పుడూ బన్నీ ఇటువంటి రోల్ ప్లే చేయలేదు. సుకుమార్ ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ సినిమాలో ఎర్రచందనం స్మగ్లింగ్ అనే కాన్సెప్ట్ ను తెరకెక్కించనున్నారు. "పుష్ప" పాత్రలో అల్లు అర్జున్ ఎదుర్కునే కాంప్లికేషన్స్ ఓ స్టార్ హీరో రియల్ లైఫ్ కి సంబంధించినవన్న విషయం ఈ మధ్య వైరల్ అవుతుందన్న విషయం తెలిసిందే. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది అన్నది సినిమా రిలీజ్ అయ్యాక గాని తెలియదు.