ఎలాంటి పాత్ర వేసిన ఆ పాత్రకు కత్రినాకైఫ్ తప్ప ఇతర హీరోయిన్లు సూట్ అవ్వరు అనే రేంజ్ లో తన అభినయంతో అదరగొడుతోంది ఈ ముద్దుగుమ్మ. అదే సమయంలో తన హాట్ హాట్ అందాలతో సినీ ప్రేక్షకులు అందరి మతి పోగొడుతుంది. అయితే ప్రస్తుతం బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న కత్రినాకైఫ్ కు అటు టాలీవుడ్ లో కూడా ఎంతో మంది అభిమానులు ఉన్నారు అన్న విషయం తెలిసిందే . కెరీర్ ఆరంభంలో అటు దక్షిణాది హీరోలు అయిన నందమూరి బాలకృష్ణతో అల్లరి పిడుగు అనే సినిమాలో నటించింది. ఈ సినిమా మంచి విజయం సాధించింది.
ఇక ఆ తర్వాత విక్టరీ వెంకటేష్ తో కలిసి మల్లేశ్వరి అనే సినిమాలో నటించి మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది ఈ ముద్దుగుమ్మ. సినిమాలలో కూడా ఈ తన అందం అభినయంతో ప్రేక్షకులను కట్టిపడేసిన ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది. ఇకపోతే ఇప్పుడు మరో దక్షిణాది హీరోతో నటించేందుకు కత్రినాకైఫ్ సిద్ధమైంది అనే టాక్ వినిపిస్తోంది. కోలీవుడ్లో విలక్షణ నటుడిగా ఎంతో గుర్తింపు తెచ్చుకున్న విజయ్ సేతుపతి నటించనున్న బాలీవుడ్ మూవీ లో జోడి కట్టబోతుందట కత్రినా కైఫ్. కాగా దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి