అయితే ఎన్ని అడ్డంకులు వచ్చినా ఆమె తన అత్తస్థైర్యం కోల్పోకుండా సినిమాల్లో నటిస్తూ జీవితాన్ని ఎదురీతుతూనే ఉంది.. సినిమా లైఫ్ ఇలా ఉంటే ఆమె పర్సనల్ లైఫ్ ఇంకా కష్టాల సుడిగుండం మాదిరిగా అయిపొయింది. ప్రేమ విఫలాం అయిపోవడం ఆమెను మరింత క్రుగదీసింది అని చెప్పొచ్చు. ఒక్కరిద్దరితో అయితే ఏదోలా సర్దుకోవచ్చు కానీ ఎనిమిది మందితో ప్రేమ పెళ్లిదాకా వచ్చి క్యాన్సిల్ అయ్యి న సందర్భాలు ఉన్నాయి. ఈ విషయాన్నీ ఆమె ఓ ఇంటర్వ్యూ లో చెప్పారు. ఆస్తుల విషయంలో , ప్రేమ విషయంలో చాల సార్లు మోసపోయాను అని ఆమె చెప్పుకొచ్చారు.
మహానటి సావిత్రి గురించి కూడా ఆమె మాట్లాడారు. తన ఆస్తుల కోల్పోయిన విధానం మహానటి సావిత్రి పరిస్థితి ఒకేలా ఉన్నదన్న ప్రశ్నపై స్పందించిన షకీలా.. ‘‘జెమినీ గణేషన్ మొదటి భార్య కూతురు ఒక ప్రశ్న అడిగింది.. సావిత్రి గారు చాలా మంచిది.. ఎవరు ఏమి అడిగినా తీసి ఇచ్చేస్తుంది.. పుణ్యం మాత్రమే చేసుకుంది. అయితే ఎందుకు అలా చచ్చింది'' అని అడిగింది. ఆ పాయింట్ నాకు బాగు గుచ్చుకుంది' అని చెప్పుకొచ్చిందామె. ఇక పోతే ఇటీవలే ఓ స్టార్ డైరెక్టర్ తనకు ఫోన్ చేసి పలకటించాడని, దాంతో తనకు ఏడుపొచ్చేసింది అని ఆమె చెప్పుకొచ్చింది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి