ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి...నాచురల్ స్టార్ నాని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వరుసగా సినిమాలు చేసుకుంటూ విజయాలు అందుకుంటూ మినిమమ్ గ్యారెంటీ హీరోగా పేరు సంపాదించుకున్నాడు. ఇక నాని తో సినిమా అంటే చాలు దర్శక నిర్మాతలు ఎంతో ఆసక్తి చూపిస్తారు. ఇక విషయానికి వస్తే దర్శకుడు శివ నిర్వాణ "నాచురల్ స్టార్" నానితో "నిన్ను కోరి" సినిమా తరువాత చేస్తున్న సినిమా  ‘టక్ జగదీష్’. ఈ సినిమాలో జగదీష్ అనే పాత్రలో నటిస్తున్నడు నాని. కొద్దిరోజుల క్రితమే ఈ సినిమాను ఏప్రిల్ 16న విడుదల  చేస్తామని చిత్రబృందం ప్రకటించడం జరిగింది. ఇప్పుడు ఈ సినిమాకి పోటీగా ‘లవ్ స్టోరీ’ సినిమాను రిలీజ్ చేయడానికి రెడీ అవుతున్నారని తెలిసి నాని షాకైనట్లు సమాచారం.

ఈ రిలీజ్ డేట్ క్లాష్ విషయంలో దిల్ రాజు ప్రమేయం ఉందనే విషయం నాని వరకు వెళ్లిందట. ఇప్పటివరకు దిల్ రాజు బ్యానర్ లో నాని మూడు సినిమాలు చేశారు.అవన్నీ కూడా దిల్ రాజుకి లాభాలు తీసుకొచ్చాయి. ‘వి’ సినిమా ఫెయిల్ అయినప్పటికీ ఓటీటీలో రిలీజ్ చేసి పది కోట్ల లాభం పొందాడు దిల్ రాజు. ఈ క్రమంలో తన సినిమాకు పోటీగా మరో సినిమా రిలీజ్ చేయడానికి దిల్ రాజు సహకరించడం ఏంటంటూ నాని ఫీలయ్యాడట. మరోపక్క హీరో నాగచైతన్య కూడా ఇలాంటి పరిస్థితిలోనే చిక్కుకున్నారు.

దర్శకుడు శివ నిర్వాణ తనకు ‘మజిలీ’ లాంటి మంచి హిట్ ఇచ్చాడు.అలాంటి డైరెక్టర్ రూపొందించిన ‘టక్ జగదీష్’ సినిమాకి పోటీగా తన సినిమా ఎందుకు రిలీజ్ చేస్తున్నారనే విషయంలో చైతు ఆరా తీసినట్లు తెలుస్తోంది. అయితే ‘టక్ జగదీష్’ ఆ టైమ్ కి రాదని చెప్పడం వలనే చైతు సైలెంట్ అయ్యాడట. మొత్తానికి ఏప్రిల్ 16 న ఏం జరగబోతుందో అనే దానిపై తీవ్రంగా చర్చ నడుస్తుందట. ఇక ఇలాంటి మరెన్నో మూవీ అప్ డేట్స్ కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో విషయాలు గురించి తెలుసుకోండి...

మరింత సమాచారం తెలుసుకోండి: