తన మొదటి భర్తతో విడాకుల అనంతరం  కొన్నేళ్ళ పాటు ఒంటరిగానే ఉన్న సింగర్ సునీత.. చాలా సంవత్సరాల తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టింది. ఈ కొత్త జీవితం చాలా ఆనందంగా ఉందనేది ఈమె పెళ్లి సమయంలోనే మొహం చూస్తేనే అర్థమైపోయింది. ఈ ఇద్దరి పెళ్లి చాలా ఘనంగా జరగడమే కాదు.. ఎంతోమంది అతిథులు కూడా వచ్చారు. గిఫ్టులు కూడా చాలానే వచ్చాయి. ఆ మధ్య విడుదలైన సునీత, రామ్ పెళ్లి వీడియోకు కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇదిలా ఉంటే తాజాగా పెళ్లి తర్వాత తొలిసారి ఇంటర్వ్యూ ఇచ్చారు ఈ కొత్తజంట. వాళ్ళను సుమ ఇంటర్వ్యూ చేయడం విశేషం.దాదాపు పాతికేళ్లుగా సునీత, సుమ స్నేహితులు.
 
ఈమె పెళ్ళికి కూడా కాస్ట్ లీ గిఫ్ట్ ఇచ్చింది సుమ.అలాగే ఇప్పుడు ఇంటర్వ్యూ కూడా చాలా సరదాగా చేసింది. వాలెంటైన్స్ డే సందర్భంగా యాంకర్ సుమ ఓ యూ ట్యూబ్ చానెల్ కోసం రామ్, సునీత జంటను ఇంటర్వ్యూ చేసంది. దీనికి సంబంధించిన ప్రోమో విడుదలైందిప్పుడు. అందులో రామ్ వీరపనేని హైట్‌పై పంచులు వేసింది సుమ. అది విని సునీత కూడా నవ్వుకుంది. అక్కడితో ఆగకుండా అసలు ప్రశ్నలు కూడా అడిగింది సుమ. ముఖ్యంగా సునీతను ఎలా ఒప్పించారు.. మీ ప్రేమకథ ఎలా ఎక్కడ ఎప్పుడు మొదలైంది అంటూ వరస ప్రశ్నలు అడిగింది సుమ. దానికి రామ్ కూడా అంతే ఓపెన్ గా సమాధానాలు చెప్పాడు. వాయిస్ కు చాలా రోజుల నుంచి ఫ్యాన్ అని..
 
అయితే వ్యక్తిగా కూడా సునీత తనకు చాలా యిష్టం అని చెప్పాడు రామ్.ప్రతీసారి కలిసినపుడు ఇంకేంటి అనే వాడని చెప్పుకొచ్చింది సునీత. ఆ ఇంకేంటిలోనే ఎన్నో అర్థాలు ఉండేవని ఆ తర్వాత అర్థమైనట్లు చెప్పింది ఈమె. ఇంకేంటి నుంచి పెళ్లి పీటల వరకు తీసుకొచ్చాడని నవ్వుకుంది. అసలు పెళ్లి అనే ఆలోచనే లేని తనను మార్చేసాడని.. లాక్ డౌన్ లోనే ఏదో చేసాడని చెప్పుకొచ్చింది సింగర్ సునీత. ఇలాగే సింగిల్ గా ఉంటావ్.. ఏం ప్లానింగ్స్ లేవా అంటూ అడిగి పెళ్లి వరకు తీసుకొచ్చాడని చెప్పుకొచ్చింది. అలా తమ ప్రేమకథ మొదలైందని.. ఒకరోజు సీన్ కట్ చేస్తే నిశ్చితార్థం జరిగిందని చెప్పుకొచ్చింది సునీత...!!


మరింత సమాచారం తెలుసుకోండి: