దీనితో నెట్ ఫ్లిక్స్ రంగంలోకి దిగి తెలుగు దినపత్రికలలో పిట్టకధలు వెబ్ సిరీస్ గురించి భారీ ప్రకటనలు ఇస్తూ ఈ వెబ్ సిరీస్ ను నిల బెట్టడానికి గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. తరుణ్ భాస్కర్ నందిని రెడ్డి నాగ్ అశ్విన్ సంకల్ప రెడ్డి లాంటి ప్రముఖ దర్శకులు శృతిహాసన్ ఇషా రెబ్బా అమలాపాల్ జగపతిబాబు సత్యదేవ్ మంచులక్ష్మి లాంటి ప్రముఖ నటులు నటించడంతో ‘పిట్టకథలు’ పై మంచి హైప్ వచ్చింది.
అయితే ఈ వెబ్ సిరీస్ లో నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అయినా పట్టించుకోకపోవడం చాలా మందిని ఆశ్చర్య పరుస్తోంది. ఇలాంటి పరిస్థితి పిట్టకధలకు ఏర్పడడానికి అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతున్న ‘దృశ్యం 2’ దాటికి ‘పిట్ట కధలు’ నిలబడలేక పోయింది అని అంటున్నారు.
మళయాళ ఇండస్ట్రీ సూపర్ స్టార్ మోహన్ లాల్ హీరోగా 2013లో వచ్చిన ‘దృశ్యం’ మూవీకి సీక్వెల్ గా వచ్చిన ‘దృశ్యం 2’ మంచి టాక్ రావడంతో ఈ మూవీ తెలుగు రీమేక్ హక్కులను తీసుకని వెంకటేష్ తన సొంత సురేష్ మూవీ బ్యానర్ పై నిర్మిస్తాడు అన్న ప్రచ్చారం జరుగుతోంది. ఇది ఇలా ఉండగా నెట్ ఫ్లిక్స్ తో పోలిస్తే అమెజాన్ ప్రైమ్ కు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ మంది సభ్యులు ఉడటం కూడ ‘పిట్ట కథలు’ వెనకడుగు కు కారణం అన్న కామెంట్స్ కూడ వినిపిస్తున్నాయి..
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి