పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ క్రియేటివ్ డైరక్టర్ క్రిష్ కాంబినేషన్ లో సినిమా సెట్స్ మీద ఉంది. ఏ.ఎం రత్నం నిర్మిస్తున్న ఈ సినిమాలో నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుంది. హర హర వీరమల్లు టైటిల్ ప్రచారంలో ఉన్న ఈ సినిమా 17వ శతాబ్ధం నాటి కథతో వస్తుందని తెలుస్తుంది. సినిమాలో పవన్ కళ్యాణ్ స్పెషల్ గా కనిపిస్తారని తెలుస్తుంది.

ఇన్నాళ్లు తన స్టైల్ తో ఆకట్టుకున్న పవన్ కెరియర్ లో మొదటిసారి ఓ పిరియాడికల్ పాత్ర.. అలాంటి సినిమా చేస్తున్నారు. సినిమాలో పవర్ స్టార్ కొత్తగా ఉంటారని తెలుస్తుంది. మణిశర్మ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్ చేశారు. 2022 సంక్రాంతికి పవన్ 27వ సినిమా రిలీజ్ అని అఫీషియల్ రిలీజ్ డేట్ చెప్పేశారు. అయితే ఇప్పటికే సూపర్ స్టార్ మహేష్ సర్కారు వారి పాట సినిమా సంక్రాంతి రిలీజ్ అని ఫిక్స్ చేశారు. 2022 బాక్సాఫీస్ ఫైట్ లో సంక్రాంతికి పవర్ స్టార్.. సూపర్ స్టార్ సినిమాలు రాబోతున్నాయి.

మహేష్, పరశురాం కాంబినేషన్ లో వస్తున్న సర్కారు వారి పాట సినిమా కూడా భారీ అంచనాలతోనే వస్తుంది. సినిమాలో మహేష్ మాస్ లుక్ తో అలరిస్తాడని తెలుస్తుంది. మహేష్, పవన్ సినిమాల మధ్య ఫైట్ సంక్రాంతి హంగామాని మరింత స్పెషల్ గా చేసేలా చేసింది. పవన్, మహేష్ ఎవరి స్టామినా వారిది.. ఎవరి సినిమాల స్థాయి వారిది. కరెక్ట్ సినిమా పడితే ఇద్దరు బాక్సాఫీస్ దగ్గర దుమ్ముదులిపేస్తారు. ప్రయోగంతో పవన్.. మాస్ మూవీతో మహేష్ ఇద్దరు నువ్వా నేనా అనేలా సంక్రాంతి పోటీకి వస్తున్నారు. పవన్, మహేష్ రిలీజ్ డేట్ క్లాష్ అవ్వకుండా వారిద్దరి సినిమాలకు ఒకటి రెండు రోజులు గ్యాప్ పెట్టుకుంటే బెటర్.               


మరింత సమాచారం తెలుసుకోండి: