ఇటీవల లాక్ డౌన్ ఎఫెక్ట్ వలన ఆగిపోయిన సినిమాలు అన్ని కూడా ఒక్కొక్కటిగా థియేటర్స్ లోకి రిలీజ్ అవుతూ
ఆడియన్స్ ని
ఖుషి చేస్తున్నాయి. మరోవైపు ఈ ఏడాది
సంక్రాంతి సమయానికి రిలీజ్ అయిన సినిమాల్లో
రవితేజ నటించిన
క్రాక్ మూవీ సూపర్ హిట్ కొట్టి
టాలీవుడ్ శుభారంభాన్ని అందించింది. ఇక ఇటీవల వచ్చిన నాంది, ఉప్పెన వంటి సినిమాలు కూడా మంచి హిట్స్ గా నిలిచిన విషయం తెలిసిందే. ఎన్నడూ లేనంతగా ఈ ఏడాది
ఆర్ఆర్ఆర్, పుష్ప,
కెజిఎఫ్ -2, రాధేశ్యామ్, లైగర్ వంటి భారీ పాన్
ఇండియా సినిమాలు ఒకదానివెంట మరొకటి రిలీజ్ కానుండడంతో వాటి ద్వారా కొన్ని వేల కోట్ల రూపాయల మేర బాక్సాఫీస్ కలెక్షన్ రానున్నట్లు చెప్తున్నారు విశ్లేషకులు.

ఇక 2022 రాబోయే
సంక్రాంతి సమయానికి ఇప్పటినుండే పలు సినిమాలు అప్పుడే బెర్త్ ని రిజర్వు చేసుకునే పనిలో ఉన్నాయి. ముందుగా రాబోయే సంక్రాంతికి తమ
సినిమా వస్థుంది అంటూ ప్రస్తుతం
సూపర్ స్టార్ మహేష్,
పరశురామ్ ల కలయికలో తెరకెక్కుతున్న సర్కారు వారి పాట
మూవీ ఇటీవల అధికారిక ప్రకటన రిలీజ్ చేసారు.
సూపర్ స్టార్ మహేష్ ఇందులో ఒక ఫైనాన్షియర్ పాత్ర చేస్తుండగా
హీరోయిన్ గా నటిస్తున్న
కీర్తి సురేష్ ఒక ప్రముఖ బ్యాంకు ఉద్యోగిని పాత్రలో కనిపించనున్నట్లు టాక్. 14 రీల్స్ ప్లస్,
జిఎంబి ఎంటర్టైన్మెంట్స్, మైత్రి
మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ మూవీకి
థమన్ మ్యూజిక్ అందిస్తుండగా మది ఫోటోగ్రఫి అందిస్తున్నారు.
అలానే ప్రస్తుతం వరుసగా సినిమాలు చేస్తూ కెరీర్ పరంగా దూసుకెళ్తున్న
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా
క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ పీరియాడిల్
మూవీ కూడా సంక్రాంతికి రిలీజ్ కానుంది అంటూ నిన్న యూనిట్ అధికారికంగా న్యూస్ రిలీజ్ చేసింది. దానితో ఎన్నో ఏళ్ల తరువాత
పవర్ స్టార్ సూపర్ స్టార్ ల మధ్య భారీ బాక్సాఫీస్ పోరు జరుగనున్నట్లు తెలుస్తోంది. అయితే లేటెస్ట్ గా కొన్ని
టాలీవుడ్ వర్గాల నుండి అందుతున్న సమాచారాన్ని బట్టి ఇటీవల సోగ్గాడే చిన్నినాయన మూవీతో భారీ హిట్ కొట్టిన
నాగార్జున, అతి త్వరలో దాని సీక్వెల్
మూవీ బంరగార్రాజు లో నటించనున్నారు. కాగా ఈ
మూవీ ఏప్రిల్ లో సెట్స్ మీదకు వెళ్తుందని, అలానే దీనిని కూడా 2022సంక్రాంతికి రిలీజ్ చేయాలని ఆ
మూవీ యూనిట్ ఫిక్స్ అయిందని అంటున్నారు. మరి అదే కనుక జరిగితే రాబోయే
సంక్రాంతి మరింతగా బడా సినిమాలతో సందడిగా మారడం ఖాయం తెలుస్తోంది.....!!