ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం అసలు ఇటువంటి గాయకుడు ఈ సృష్ట్టిలోనే మళ్ళీ పుట్టడు. ఎన్నిభాషలు ఎన్నివేల పాటలు మరియు ఎంతో మంది నటులకు గాత్రాన్ని అందించిన  అద్భుతమైన వ్యక్తి. ఆతడి యొక్క హఠాన్మరణం యావత్తు దేశం మొత్తం లోని అభిమానులు మరియు ప్రముఖులు ఇంకా నమ్మలేకపొతున్నారు. అతడి మరణ వార్త  ఎందరో అభిమానులకు గుండెపగిలే సంఘటన వంటిది. అంతలా అతని మరణం మొత్తం అన్ని భాషల ఇండస్ట్రీ లనే విషాదం లోకి నెట్టి వేసింది  ప్రతి ఒక్క ఇండస్ట్రీ నుండి ప్రముఖులు  అతడికి ఘనంగా నివాళి అర్పించారు. అంతేకాదు అయన అందుకొని అవార్డు అంటూ లేదు మరియు భారత ప్రభుత్వం నుంచి 'పద్మ' అవార్డులు సైతం అతడిని వరించాయంటే దేశానికి బాలసుబ్రహ్మణ్యం లాంటి వ్యక్తి పుట్టడం నిజంగా గర్వకారణంగా చెప్పవచ్చు.  

అయన లేకుండా ఏ సంగీత విభావరి జరిగేది కాదు, ఇప్పుడు  అయన లేకుండా జరుగుతుంటే చూడాలని అనిపించడం లేదు బాలసుబ్రహ్మణ్యం లేని లోటు స్పష్టంగా కనిపిస్తుంది. అయితే బాలసుబ్రహ్మణ్యం వ్యాఖ్యాతగా ఈటీవీ లో 'పాడుతా తీయగా' అనే కార్యక్రమం వచ్చేది. ఈ కార్యక్రమం ద్వారా ఎంతో మంది గాయకులను తెలుగు ఇండస్ట్రీ కి ఇచ్చారు. బాలు గారి మరణవార్త అభిమానులతో సహా వారి యొక్క కుటుంబ సభ్యులు కూడా దానినుండి బయటపడలేక పోతున్నారు.

అయితే ఇప్పుడు బాలసుబ్రహ్మణ్యం భార్య అయిన సావిత్రి  ఆరోగ్య పరిస్థితి పై కొన్ని వార్తలు వస్తున్నాయి. ఆమె భర్త మరణ వార్త నుంచి ఎక్కువ బయటకు రాకపోవడం తో అటువంటి వార్తలు వస్తున్నాయి. అయితే తాజా సమాచారం ప్రకారం బాలసుబ్రహ్మణ్యం మరణం తర్వాత ఆమె కుటుంబ సభ్యులు చెన్నైలోనే ఉన్న సంగతి తెలిసిందే. అయితే కొన్ని రోజుల నుంచి ఆమె తన కుమారుడు తో కలిసి  బయటకి వెళ్తున్నారని, ఆమె ఆరోగ్యం కూడా బాగానే ఉందని తెలుస్తుంది. బాలు గారి భార్య గురించి ఈ విషయం తెలియడంతో అభిమానులు ఊపిరి పీల్చుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: