దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్  ఎన్టీఆర్ లు హీరోలుగా రాబోతున్న చిత్రం rrr . బాహుబలి తర్వాత రాబోతున్న ఈ సినిమా పై దేశం మొత్తం ఎన్నో అంచనాలు పెట్టుకుంది.. బాహుబలి తో ప్రభాస్ ఒక్కసారిగా నేషనల్ స్టార్ అయిపోగా అయన మార్కెట్ ఒక్కసారిగా దేశమంతా పెరిగిపోయింది. ఇక ఈ సినిమా లో చేసిన అందరు నటీనటులు ఏదోవిధంగా లాభపడ్డారు.. ప్రతి క్యారెక్టర్ కి కూడా దేశం మొత్తం పేరొచ్చింది.. వారికి మంచి గుర్తింపు లభించగా ఎక్కడికెళ్లినా వారిని గుర్తు పట్టె విధంగా బాహుబలి సినిమా వారికి పాపులారిటీ తెచ్చిపెట్టింది.

పాన్ ఇండియా గా వస్తున్న rrr సినిమా రెండు కాలాలకు చెందిన ఇద్దరు గొప్ప వ్యక్తుల కథ అని చెప్తున్నారు.. ఇందులో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు గా నటిస్తుండగా, ఎన్టీఆర్ కొమురం భీం గా నటిస్తున్నారు.. అలియా భట్హీరోయిన్ గా నటిస్తుండగా అజయ్ దేవగన్ కీలక పాత్ర లో నటిస్తున్నాడు.. బాహుబలి తో రాజమౌళి టాలీవుడ్ స్టామినా ని చాటిచెప్పగా ఈ సినిమా తో మరో లెవెల్ కి తీసుకెళ్తాడు అంటున్నారు. పైగా మల్టీ స్టారర్ చిత్రం కావడంతో ఈ చిత్రం పై దేశవ్యాప్తంగా అంచనాలు ఉన్నాయి..

ఇకపోతే సినిమాపై అంచనాలను కూడా అభిమానుల్లో మరో స్థాయికి తీసుకెళ్ళిపోతున్నాడు. రాజమౌళి సినిమాల్లో యాక్షన్ పార్ట్ కు ఎంత ప్రాధాన్యత ఇస్తారో తెలిసిందే. అలా ఈ సినిమాలో లేటెస్ట్ గా హాలీవుడ్ స్టంట్ డైరెక్టర్ నిక్ పావెల్ తో డిజైన్ చేషిస్తున్న క్లైమాక్స్ షాట్ పై అప్డేట్ ఇచ్చి rrr ఫ్యాన్స్ ను ఆశ్చర్యపరిచారు. దీనితో ఇక్కడ నుంచి ఈ సినిమాలో యాక్షన్ మాత్రం ఊహించిన దాని కంటే ఎక్కువగానే ఉంటుంది తప్ప తక్కువగా అయితే రాజమౌళి చూపించట్లేదు అని చరణ్ మరియు తారక్ అభిమానులు ఒక ఫైనల్ క్లారిటీకి వచ్చేసారు. మరి రాజమౌళి ఈ సినిమాలో ఏ రేంజ్ యాక్షన్ ను ప్లాన్ చేసారో తెలియాలి అంటే వచ్చే అక్టోబర్ 13వరకు ఆగక తప్పదు.

మరింత సమాచారం తెలుసుకోండి: