సినిమా పరిశ్రమలో అడుగుపెట్టిన నటీమణులు తమ జీవితాల్లో ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొంటారు. హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన వారి పరిస్థితి మరింత దయనీయంగా ఉంటుంది. అందం ఉన్నంత వరకే హీరోయిన్లను దర్శకనిర్మాతలు గుర్తు పెట్టుకుంటారు. అందం, అభినయం ఉన్నా కూడా సినిమాలు ఫెయిల్ అయితే వారిని ఎవరూ లెక్క చేయరు. వారి సినిమా కెరీర్ 10-15 సంవత్సరాలు వరకు మాత్రమే ఉంటుంది. కొందరు అవకాశాలు వచ్చినంత వరకు సినిమాల్లో నటించి అనంతరం పెళ్ళి చేసుకుని హాయిగా సెటిల్ అవుతారు. మరికొందరు మాత్రం పెళ్లిళ్లు కాక సినిమా అవకాశాలు రాక నరకయాతన అనుభవిస్తారు.

కొందరికి పెళ్లిళ్లు అయినా కూడా వారి వైవాహిక జీవితం ఎంతో కాలం నిలబడదు. అలాంటి వారందరూ మానసిక ప్రశాంతత కోసం పాకులాడుతూ ఉంటారు. కొందరు సిటీ లైఫ్ నుంచి దూరంగా ఉంటూ సన్యాసం కూడా తీసుకుంటుంటారు. స్టార్ హీరోయిన్ నయనతార కూడా తన జీవితంలో ఎదురైన చేదు అనుభవాల వల్ల సన్యాసం తీసుకోవాలని నిర్ణయించుకున్నారు. మళ్ళీ ఆమె తన నిర్ణయాన్ని మార్చుకున్నారు. కానీ కొందరు హీరోయిన్లు సన్యాసం పుచ్చుకొని అందర్నీ ఆశ్చర్యపరిచారు. వారెవరో ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం.

1. మనీషా కొయిరాలా

నేపాల్ దేశానికి మాజీ ప్రధానమంత్రిగా పనిచేసిన బిశ్వేశ్వర్ ప్రసాద్ కొయిరాలా మనవరాలు అయిన మనీషా కొయిరాలా డాక్టర్ కావాలనుకున్నారు. కానీ మోడలింగ్ రంగంలో అడుగుపెట్టి అనంతరం సినిమారంగంలో కాలు మోపారు.ఎన్నో సినిమాల్లో హీరోయిన్గా నటించిన ఆమె ఒవేరియన్ క్యాన్సర్ బారిన పడ్డారు. చికిత్స అనంతరం సన్యాసం పుచ్చుకున్నారు. ఆ తర్వాత మళ్ళీ సన్యాసాన్ని వీడి సినిమారంగంలో రీ ఎంట్రీ ఇచ్చారు.

2.  మమతా కులకర్ణి

బాలీవుడ్ నటీ మమతా కులకర్ణి దొంగ పోలీస్ సినిమాలో మోహన్ బాబు సరసన నటించారు. ఈమె కూడా ఏవో కారణాల వల్ల సన్యాసినిగా మారారు. అయితే 2000 కోట్ల డ్రగ్స్ తయారీ వ్యాపారంలో మమతా కులకర్ణి ఉందని థానే కోర్టు తేల్చింది.

3. సుచిత్రాసేన్

25 సంవత్సరాల పాటు చిత్ర పరిశ్రమలో ఒక ఊపు ఊపిన నటి సుచిత్రా సేన్ ఇంట్లో గొడవల కారణంగా ఆధ్యాత్మికం వైపు అడుగులు వేశారు. అనంతరం స్వామి వివేకానంద ఇన్స్పిరేషన్ గా తీసుకొని సన్యాసినిగా మారారు.

మరింత సమాచారం తెలుసుకోండి: