'మొగలిరేకులు' సీరియల్ అప్పుడు ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.సినిమా రేంజిలో ఆ సీరియల్ కి బ్రహ్మ రధం పట్టారు ప్రేక్షకులు. ఎన్నో సంవత్సరాలు పాటు ఆ సీరియల్ ప్రేక్షకులని ఎంతగానో అలరించింది. ఇక ఆ సీరియల్ ద్వారా బోలెడంత క్రేజ్ ను సంపాదించుకున్న నటుడు సాగర్(ఆర్.కె.నాయుడు) హీరోగా తాజాగా నటించిన సినిమా "షాదీ ముబారక్ ".. దృష్యా రఘనాథ్ హీరోయిన్ గా ఈ సినిమాలో నటించింది.పద్మశ్రీ డైరెక్షన్లో ఈ సినిమా తెరకెక్కింది. 'శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్' బ్యానర్ పై దిల్ రాజు,శిరీష్ లు కలిసి ఈ చిత్రాన్ని నిర్మించారు. ప్రమోషన్లలో భాగంగా విడుదల చేసిన టీజర్, ట్రైలర్ లకు మంచి స్పందన రావడం పైగా ఇది దిల్ రాజు బ్రాండ్ ఉన్న సినిమా కావడంతో కచ్చితంగా ఈ చిత్రం సూపర్ హిట్ అవుతుందని అంతా అనుకున్నారు.అందుకు తగినట్టుగానే మార్చి 5న విడుదలైన ఈ చిత్రానికి హిట్ టాక్ వచ్చింది.


మంచి కామెడీ ఉంది.. టైం పాస్ మూవీ అంటూ ప్రేక్షకులు కామెంట్సే చేశారు.కాని వసూళ్లు మాత్రం ఈ సినిమాకి దారుణంగా వస్తున్నాయి. ఇక ఇప్పటికి విడుదల అయ్యి 4 రోజులు అయినా కాని ఏమాత్రం గ్రోత్ లేదు.ఇక ఈ సినిమా 4 రోజుల వసూళ్ల విషయానికి వస్తే..'షాదీ ముబారక్' చిత్రానికి రూ.2.55 కోట్ల బిజినెస్ జరిగింది కాబట్టి.. బ్రేక్ ఈవెన్ కు 2.9కోట్ల వరకూ షేర్ ను రాబట్టాల్సి ఉంది. 4 రోజులు పూర్తయ్యేసరికి ఈ చిత్రం 0.15 కోట్ల షేర్ ను రాబట్టింది. అంటే ఇంకా 2.70 కోట్ల పైనే షేర్ ను రాబడితే తప్ప బ్రేక్ ఈవెన్ అయ్యే అవకాశం లేదు. కేవలం ప్రమోషన్లు లేకపోవడం వలనే ఈ చిత్రం ఘోరంగా ప్లాప్ అయ్యిందని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ సినిమా తేరుకోవడం కష్టంగానే కనిపిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: