ప్రస్తుతం భారతీయ చలనచిత్ర పరిశ్రమలో ప్రియాంక చోప్రా కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.  ఒక సాదాసీదా హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ గా క్రేజ్ సంపాదించింది. ఇక బాలీవుడ్ లో ఎన్నో గ్లామర్ పాత్రల్లో నటించిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత ప్రేక్షకులు అందరి మనసులను కొల్లగొట్టింది.  తన హాట్ హాట్ ఫోటో షూట్లతో సోషల్ మీడియాలో ఎన్నోసార్లు హాట్ టాపిక్ గా మారిపోయింది ప్రియాంక చోప్రా.  కేవలం బాలీవుడ్ తో మాత్రమే తన కెరియర్ ఆపకుండా ఏకంగా హాలీవుడ్లో కూడా అవకాశాలు దక్కించుకుంది ఈ ముద్దుగుమ్మ.



 ఇక కేవలం సినిమాల్లోనే కాదు ఎన్నో సేవా కార్యక్రమాలు కూడా చేపడుతూ ఎంతో మందికి ఆదర్శంగా నిలిచింది. ఇక అమెరికన్ పాప్ సింగర్ నిక్ జోనస్ ని పెళ్లి చేసుకొని అసలు సిసలైన గ్లోబల్ స్టార్ గా మారిపోయింది ప్రియాంక చోప్రా.  ఇక ప్రస్తుతం బాలీవుడ్లో వరుస అవకాశాలు అందుకోవడమే కాదు హాలీవుడ్లో కూడా వరుస సినిమాలు చేసుకుంటూ దూసుకుపోతుంది.  అయితే ఇకపోతే గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా ఇటీవలే తన కెరియర్ ప్రారంభంలో ఎదురైన చేదు అనుభవాల గురించి చెప్పింది. ఈ మధ్య కాలంలో ఎంతో మంది హీరోయిన్లు తమ కెరీర్ ఆరంభంలో ఎదురైన చేదు అనుభవాల గురించి సోషల్ మీడియా వేదికగా వెల్లడించడం జరుగుతుంది అన్న తెలిసిందే.



 ఇక ఇటీవలే ప్రియాంక చోప్రా కూడా తన కెరియర్ ప్రారంభంలో ఎదురైనా  ఒక చేదు అనుభవం గురించి అభిమానులతో పంచుకున్నారు. తాను మొదట్లో ఒక స్పెషల్ సాంగ్ చేస్తున్న సమయంలో డైరెక్టర్ తన దగ్గరికి వచ్చి లో దుస్తుల్లో కనిపించాలి అని అడిగాడు అంటూ తెలిపింది.  మొదట ఈ విషయం మొదట చెప్పలేదని కానీ సినిమా సెట్స్ లో ఒక్కసారిగా అలా చెప్పడంతో షాకయ్యాను అంటూ తెలిపింది. కానీ అప్పుడే తన కెరియర్ ప్రారంభం అవుతున్న సమయంలో ఇక డైరెక్టర్ చెప్పినదానికి నో చెప్పలేక పోయాను అంటూ ప్రియాంక తెలిపింది. తన కెరియర్ లో అదే ఒక చింతించ దగ్గ విషయం అంటూ ప్రియాంక చోప్రా చెప్పుకొచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: