
ఈ చిత్ర తెలుగు డబ్బింగ్ రైట్స్, ఓవర్సీస్ రైట్స్ శ్రేయస్ మీడియా అనుసంధానిత సంస్థ గుడ్ సినిమా గ్రూప్ ఫ్యాన్సీ అమౌంట్‌కు దక్కించుకుంది. అంతే కాదు ఈ చిత్రానికి తెలుగు టైటిల్‌గా 'కె3 కోటికొక్కడు' అని కూడా ఆ సంస్థ ఖరారు చేసింది.ఇక ఈ సినిమా ఫస్ట్ లుక్‌ని శుక్రవారం విడుదల చేశారు.'కె3 కోటికొక్కడు' ఫస్ట్ లుక్ పోస్టర్‌ను ప్రముఖ దర్శకులు మారుతి, బాబీ, గోపీచంద్ మలినేని సంయుక్తంగా విడుదల చేయడం విశేషం. కన్నడ సూపర్ స్టార్ కిచ్చా సుదీప్ సిగరెట్ వెలిగిస్తూ డాలర్స్ మధ్య నుండి నడుస్తూ ఉన్న ఈ స్టైలిష్ లుక్ ఆకట్టుకుంటోంది. డబ్బింగ్ కార్యక్రమాలన్నీ పూర్తిచేసి ఏప్రిల్ 4వ వారంలో ఈ చిత్రాన్ని కన్నడ మరియు తెలుగు భాషల్లో ఏకకాలంలో అత్యధిక థియేటర్లలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లుగా మేకర్స్ ప్రకటించారు.కన్నడలో భారీ అంచనాలున్న 'కోటిగోబ్బ 3' చిత్రాన్ని.. తెలుగులో 'కె3 కోటికొక్కడు' టైటిల్‌తో స్పందన పాసం, శ్వేతన్ రెడ్డి సమర్పణలో దేవేందర్ డీకే మరియు గుడ్ ఫ్రెండ్స్ సంయుక్తంగా తెలుగులో విడుదల చేయనున్నారు.