విక్టరీ వెంకటేష్ తాజగా నటిస్తున్న సినిమా నారప్ప. జాతీయ అవార్డు దక్కించుకున్న తమిళ సినిమా అసురన్ కి ఈ సినిమా రీమేక్. ఇక అసురన్ లో ధనుష్ పోషించిన పాత్రను వెంకటేష్ పోషిస్తున్నాడు. మొదట ఈ సినిమా రిలీజ్ డేట్ ప్రకటించిన కాని కన్ఫామ్ చెయ్యలేదు. ఎందుకంటే మరో సీనియర్ స్టార్ హీరో మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ఆచార్య సినిమా మే నెల 13వ తేదీన విడుదల కానున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా రిలీజైన ఒకరోజు తరువాత నారప్ప సినిమా విడుదల కావాల్సి ఉంది. ఆచార్య, నారప్ప సినిమాలలో ఒక సినిమా విడుదల వాయిదా పడుతుందని వార్తలు వస్తున్నా ఏ సినిమా వాయిదా పడుతుందో తెలియడం లేదు. ఆచార్య రిలీజ్ డేట్ వాయిదాకు సంబంధించి వార్తలు వస్తున్నా చిరంజీవి రిలీజ్ డేట్ విషయంలో పట్టుదలతో ఉన్నారని తెలుస్తోంది.ఈ సినిమాను ఎట్టి పరిస్థితుల్లోనైనా మే 13వ తేదీనే రిలీజ్ చేయాలని భావిస్తున్నారని సమాచారం. మరోవైపు ఆచార్య ప్రమోషన్స్ వేగంగా జరుగుతుంటే నారప్ప చిత్రయూనిట్ మాత్రం సైలెంట్ గా ఉంది.


ఒక పక్క తమిళ్ లో ధనుష్ నటించిన అసురన్ బ్లాక్ బస్టర్ అయ్యి జాతీయ అవార్డు దక్కించుకోవడంతో ప్రేక్షకుల్లో నారప్ప సినిమాపై అంచనాలు మరింత పెంచేలా ప్రయత్నాలు జరగాల్సి ఉంది. నారప్ప సినిమా పాటలు, ట్రైలర్ రిలీజ్ డేట్ కు సంబంధించిన ప్రకటనలు వెలువడాల్సి ఉంది. నారప్ప సినిమా నుంచి ఇప్పటివరకు ఫస్ట్ లుక్, టీజర్ రిలీజ్ కాగా ఈ సినిమాకు సంబంధించిన అప్ డేట్స్ ఇవ్వాలని వెంకటేష్ ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా కోరుతున్నారు.నారప్ప చిత్రయూనిట్ రిలీజ్ డేట్ విషయంలో స్పష్టత వచ్చిన తరువాతే పబ్లిసిటీ కార్యక్రమాలను మొదలు పెడదామని భావిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి.


సినిమా కంటెంట్ బాగుంటే చాలు పబ్లిసిటీ పెద్దగా అవసరం లేదు. ఇక నారప్ప సినిమాపై వెంకటేష్ ఫుల్ కాన్ఫిడెంట్ గా వున్నాడు. ఈ సినిమా ఎలా అయిన వెంకీ కి మంచి హిట్ తో పాటు మంచి పేరుని కూడా తీసుకురావడం ఖాయమట. చూడాలి మరి తమిళ్ లో ధనుష్ మ్యాజిక్ ని వెంకీ రిపీట్ చేస్తాడో లేదో.. ఇక ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన మూవీ అప్ డేట్స్ కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో ఆసక్తికరమైన విషయాలు గురించి తెలుసుకోండి....

మరింత సమాచారం తెలుసుకోండి: