దగ్గుబాటి రానా కేవలం రొటీన్ రొడ్డకొట్టుడు సినిమాలు చేయడానికి అస్సలు ఇష్టపడరు. ఆయన తన కంఫర్ట్ జోన్ దాటి కొత్త జానర్ లో సినిమాలు చేసేందుకు ఇష్టపడతారు.
లవ్ స్టోరీ చిత్రాలు ఒక ఊపు ఊపుతున్న కాలంలో
రానా లీడర్ వంటి పొలిటికల్ చిత్రంతో వచ్చి
బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకున్నారు. ఆ తర్వాత కూడా
రానా మిగతా
టాలీవుడ్ హీరోలకు భిన్నంగా సినిమాలు చేస్తూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు దక్కించుకున్నారు.
ఇటీవల విడుదలైన అరణ్య సినిమాలో కూడా
రానా తన స్టార్ డమ్ ని పక్కన పెట్టి చాలా న్యాచురల్ గా కనిపించి తన పాత్రకు వందశాతం న్యాయం చేసి సినీ విమర్శకుల ప్రశంసలు పొందారు. విరాట పర్వం లో నక్సలైట్ గా కనిపించనున్న
రానామరొక సినిమాలో మరొక కొత్త అవతారంలో కనిపించేందుకు రెడీ అయ్యారట.
కోలీవుడ్ డైరెక్టర్ మిలింద్ రౌ తీస్తున్న సూపర్ నాచురల్ యాక్షన్ అడ్వెంచర్
థ్రిల్లర్ లో
రానా పోలీస్ గా నటించనున్నారట. ఈ
సినిమా హిందీ, తెలుగు,
తమిళ భాషలలో రూపొందించానున్నారని సమాచారం. గోపీనాథ్ అచంట, రాంబాబు సంయుక్తంగా ఈ బహుభాషా సినిమాని నిర్మించనున్నారని తెలుస్తోంది.
మిలింద్ రౌ 2017 లో గృహం వంటి ఫుల్ లెన్త్ హారర్
మూవీ తెరకెక్కించి
బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకున్నారు. ఈ
సినిమా చివరిలో సీక్వెల్ ఉంటుందని హింట్ ఇచ్చారు కానీ నాలుగు సంవత్సరాలు గడుస్తున్నా గృహం
మూవీ సీక్వెల్ సెట్స్ పైకి వెళ్ళలేదు. స్టోరీ రెడీ అయింది కానీ సిద్ధార్థ బిజీగా ఉండటంతో సీక్వెల్ మొదలుకావడం ఆలస్యం అవుతోందని ఆయన చెప్పుకొచ్చారు.
ఇకపోతే
రానా ఒక సూపర్ నాచురల్ జానర్ లో పోలీసుగా నటించాలని ఓ బోల్డ్ డెసిషన్ తీసుకోగా.. ఈ వార్త ప్రస్తుతం అభిమానుల్లో ఆసక్తిని రేపుతోంది. అయ్యప్పనమ్ కోశియుమ్ తెలుగు
రీమేక్ పూర్తి చేసిన అనంతరం రానా.. మిలింద్ రౌ తో కలసి
సినిమా చేసే అవకాశం ఉంది.