టాలీవుడ్ లో నెంబర్ వన్ హీరోగా కొనసాగుతూ రాజకీయ ప్రవేశం చేసి, అక్కడ కూడా సీఎం పదవిలో రాజ్యమేలిన వ్యక్తి ఎవరైనా ఉన్నారా అంటే, అది కేవలం ఎన్టీఆర్ గారే అని చెప్పవచ్చు. ఇక అదే తరహాలోనే అన్నగారి నటవారసుడు బాలకృష్ణ, తండ్రికి తగ్గ తనయుడిగా అగ్ర హీరోగా రాణిస్తున్నారు. అంతేకాదు ఒక నట వారసుడిగా అడుగుపెట్టి, గత 46 సంవత్సరాలుగా హీరోగానే కొనసాగుతున్న ఏకైక హీరో బాలకృష్ణ. ప్రజలు తండ్రిని ఆదరించినట్లు గానే బాలకృష్ణ ను కూడా బాగా ఆదరిస్తున్నారు. ప్రపంచ సినీ చరిత్రలో ఒక నటవారసుడు ఇన్ని ఏళ్లుగా హీరో గా కొనసాగిన వాళ్ళు కూడా ఎవరూ లేరు.



తన తండ్రి ఎన్టీఆర్ అడుగుజాడల్లో హీరోగా అడుగుపెట్టిన బాలకృష్ణ, తన తండ్రి హీరో గా నటించిన సినిమాలలో శ్రీ రాముడు, శ్రీకృష్ణుడు, శ్రీకృష్ణ దేవరాయలు వంటి పలు పాత్రలు బాలకృష్ణ పోషించడం విశేషం.
1).1974లో తండ్రి ఎన్టీఆర్ దర్శకత్వంలో తెరకెక్కిన "తాతమ్మకల" సినిమాతో బాలకృష్ణ బాల నటుడిగా అరంగేట్రం చేశారు. ఈ సినిమాలో బాలకృష్ణ తాతమ్మకల నెరవేర్చే మునిమనవడి పాత్రలో,బాలయ్య అప్పట్లోనే అద్భుతం సృష్టించారు. ఇక ఎన్టీఆర్, బాలకృష్ణ కాంబినేషన్ లో వచ్చిన మొదటి చిత్రం ఇది అని చెప్పవచ్చు. ఈ చిత్రంలో ఎన్టీఆర్ మరో కొడుకు హరికృష్ణ కూడా నటించారు.2). ఎన్టీఆర్ నందమూరి బాలకృష్ణ కాంబినేషన్లో వచ్చిన రెండో చిత్రం అన్నదమ్ముల అనుబంధం. ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాన్ని సాధించింది అని కూడా చెప్పవచ్చు.
3). ఎన్టీఆర్, బాలకృష్ణ కాంబినేషన్ లో వచ్చిన మూడో చిత్రం"వేములవాడ భీమకవి". ఈ చిత్రంలో బాలయ్య టైటిల్ రోల్ పోషించడం విశేషం. ఈ చిత్రం బాక్స్ ఆఫీసు దగ్గర హిట్ అని నిరూపించుకుంది.
4). ఈ ఇద్దరి కాంబినేషన్లో వచ్చిన ఐదో చిత్రం"అక్బర్ సలీం అనార్కలి". ఈ చిత్రంలో ఎన్టీఆర్ అక్బర్ పాత్ర పోషిస్తే, బాలయ్య సలీం పాత్రలో నటించారు. ఈ చిత్రం బాక్స్ ఆఫీసు దగ్గర బోల్తా పడింది అని చెప్పవచ్చు.
5). వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన మరో చిత్రం"శ్రీ మద్విరాట్ పర్వం". ఈ చిత్రం బాక్స్ ఆఫీసు దగ్గర పర్వాలేదనిపించింది. ఈ చిత్రంలో ఎన్టీఆర్ ఐదు పాత్రలు పోషించారు.
ఎన్టీఆర్ నందమూరి తారకరామారావు నటించిన మరో చిత్రం"దాన వీర శూర కర్ణ". ఈ చిత్రంలోని అభిమన్యుడు పాత్రల్లో బాలకృష్ణ అందరిని మెప్పించాడు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద చరిత్ర సృష్టించింది.అలాగే శ్రీ వెంకటేశ్వర కళ్యాణం, రౌడీ రాముడు కొంటె కృష్ణుడు, అనురాగ దేవత, సింహం నవ్వింది, శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర, బ్రహ్మర్షి విశ్వామిత్ర.


మరింత సమాచారం తెలుసుకోండి: