మెగాప్రిన్స్ వ‌రుణ్ తేజ్ స్టైలే వేరు. అంద‌రూ హంగామాగా సినిమాలుచేస్తే మ‌నోడు మాత్రం సైలెంట్ గా సినిమాలు చేస్తూ వ‌రుస హిట్లు కొడుతున్నాడు. స్టార్ హీరో రేంజ్‌కు ఎద‌గాల‌ని తెగ ప్ర‌య‌త్నాలు చేస్తున్నాడు. ఇందుకోసం హిట్ ఫార్ములాను బాగానే ప‌ట్టేసుకున్నాడు. ఇప్ప‌టికే వ‌రుస సినిమాల‌తో క్ష‌ణం తీరిక‌లేకుండా షూటింగులు చేస్తున్నాడు. ఓవైపు ఘని షూటింగ్‌లో పాల్గొంటూనే ఇంకోవైపు ఎఫ్ 3లో న‌టిస్తున్నాడు. ఇరు సినిమాల షెడ్యూల్స్ శరవేగంగా పూర్తవుతుండగానే క‌రోనా సెకండ్ వేవ్ మొదలైంది. దీంతో అన్ని సినిమాలు షూటింగులు నిలిచిపోయాయి. ఈ ప్రభావంతో ప్రస్తుత లాక్ డౌన్ లో వరుణ్ ఇంట్లోనే గృహనిర్భంధంలోకి వెళ్లాడు. ఆయ‌న సినిమాల షూటింగులు కూడా నిలిచిపోయాయి.

అయితే ఈ దొరికిన ఖాళీ సమయాన్ని అతడు ఎలా సద్వినియోగం చేస్తున్నాడు? అంటే.. వరుణ్ తేజ్ ప్రాక్టీస్ చూస్తే మీరే చెప్పేస్తారు. కొత్త టెక్నిక్ లు నేర్చుకుంటున్నాడు. స్కిల్స్ ను పెంచుకుంటూ త‌న మార్కు సినిమాలో క‌నిపించేందుకు తెగ ట్రై చేస్తున్నాడు. వరుణ్ నిన్న రాత్రి ఇన్ స్టాలో ఓ వీడియోను షేర్ చేశారు. తన ముక్కుపై కొన్ని సెకన్ల పాటు ఒక ఫిడ్జెట్ స్పిన్నర్ ను చక్కగా బ్యాలెన్స్ చేస్తున్నాడు. ఈ విధ‌మైన బ్యాలెన్సింగ్ చేయాలంటే చాలా క‌ష్ట‌ప‌డాలి.

అయితే వ‌రుణ్ మాత్రం చాలా త్వ‌ర‌గా దీన్ని నేర్చుకున్న‌ట్టు తెలుస్తోంది. ఇక రెండో వేవ్ లో సినీ పరిశ్రమ ఎప్పుడు ఓపెన్ అవుతుందో ఎవ‌రికీ తెలియ‌ట్లేదు. తిరిగి వరుణ్ తేజ్ తన సినిమాల షూటింగుల్లో ఎప‌పుడు పాల్గొంటాడో అని అభిమానులు ఎదురు చూస్తున్నారు. అయితే జూన్ లేదా జూలైలో ఘని షూటింగ్ తిరిగి ప్రారంభించాలని డైరెక్ట‌ర్లు, ప్రొడ్యూస‌ర్లు భావిస్తున్నారు. ఇప్పటికే దీనికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఎఫ్ 3 చిత్రీకరణ ప్లానింగ్ పైనా అప్ డేట్ రావాల్సి ఉంది. ఎఫ్‌-3పై భారీ అంచానాలు ఉన్నాయి. ఈ సినిమా ఎప్పుడు వ‌స్తుందా అని అంతా ఎదురుచూస్తున్నారు.





మరింత సమాచారం తెలుసుకోండి: