టాలీవుడ్ లో ఎవర్ గ్రీన్ సినిమాల్లో మురారి ఒకటి అని చెప్పచ్చు. మహేశ్‌బాబు కథానాయకుడిగా కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కిన  ఈ ‘మురారి’ సినిమాలో సోనాలి బింద్రే హీరోయిన్. మొన్న ఫిబ్రవరి నెలకి ఈ సినిమా 20 ఏళ్లు పూర్తిచేసుకుంది. ఎలాంటి వల్గారిటీ లేకుండా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఒక కంప్లీట్ ఫ్యామిలీ ఎంట్టైనర్ గా నిలిచింది. అమ్మ వారి గుడిలో దొంగతనం చేయబోయిన ఒక కుటుంబానికి తగిలిన శాపం నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కింది.


అయితే సాధారణంగా ప్రతి సినిమాలో విలన్‌ను హీరో చంపడానికి ప్రయత్నిస్తాడు. అయితే, ఈ సినిమాలో విలన్ మనిషి కాదు, అందరూ చేతులు ఎత్తి మొక్కే దేవత. ఆవిడను ఎలా ప్రసన్నం చేసుకోవాలో ఎవరికీ తెలియదు. అలా చివరి దాకా హీరో ఉంటాడా ? చనిపోతాడా ? లాంటి అనేక డౌట్స్ తోనే సినిమా సాగుతుంది. హీరో ఆ గండం నుంచి ఎలా బయటపడతాడు? అని ప్రేక్షకుడు చివరి వరకూ ఉత్కంఠతో చూస్తూ ఉండగలిగేలా దర్శకుడు కృష్ణ వంశీ చేయలిగలిగారు.  ఈ సినిమాలో మహేష్ బాబు ఎంతో అందంగా కనిపిస్తారు.



ఆయన్ను చూడగానే బృందావనం గుర్తొచ్చి ‘మురారి’ అని టైటిల్ పెట్టాం’ అని కృష్ణవంశీ ఒక సందర్భంలో చెప్పుకొచ్చారు. మురారి’ సినిమా పరంగానే కాదు, మ్యూజికల్‌గానూ మంచి హిట్‌, ఈ సినిమాకి మణిశర్మ అందించిన పాటలు ఎప్పటికీ ఎవర్‌గ్రీన్‌. ముఖ్యంగా ‘అలనాటి రామచంద్రుడికి అన్నింటా సాటి ' అనే పాట ఇప్పటికీ పెళ్లి వేడుకల్లో మార్మోగుతూనే ఉంటుంది. సాధారణంగానే కృష్ణవంశీ సినిమాలంటే జనంతో నిండుగా ఉంటాయి. ఈ సినిమాలో కూడా కుటుంబం నిండా జనంతో అన్ని ఫ్రేములు నిండుగా కనిపిస్తూ ఉంటాయి. అందుకే ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ గురించి మాట్లాడుకోవాలి వస్తే కచ్చితంగా మురారి ప్రస్తావన రాక తప్పదు. ఒకరకంగా ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ కి ట్రెండ్ సెట్టర్ 'మురారి' అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: