టాలీవుడ్ డైరెక్టర్స్ లో టాప్ స్థానాన్ని అందుకున్న శ్రీను వైట్ల ఒకప్పుడు సక్సస్ ఫుల్ సినిమాలకు చిరునామాగా కొనసాగాడు. ‘ఢీ’ ‘రెడీ’ ‘కింగ్’ ‘దూకుడు’ సినిమాలతో శ్రీను వైట్ల ఇమేజ్ తారా స్థాయికి ఎదిగింది. అప్పట్లో అతడితో సినిమాలు చేయడానికి టాప్  హీరోలు అంతా ఆశక్తి కనపరిచేవారు.


జూనియర్ ఎన్టీర్ తో తీసిన  ‘బాద్‌షా’ నుండి శ్రీనువైట్ల పరాజయాలు మొదలయ్యాయి. ‘ఆగడు’ ‘బ్రూస్‌లీ’ ‘మిస్టర్’ ‘అమర్ అక్బర్ ఆంటోనీ’ ఇలా ఇతడు దర్శకత్వం వహించిన సినిమాలు అన్నీ వరస పరాజయాలు చెందడంతో ఇతడు ఔట్‌ డేటెడ్ డైరెక్టర్ల జాబితాలో చేరిపోయాడు. అయితే రెండేళ్లకు పైగా విరామం తర్వాత వైట్ల ఇప్పుడు ‘ఢీ అండ్ ఢీ’ అనే మూవీని మంచు విష్ణు తీయాలని ప్రయత్నిస్తున్న ఆ మూవీ ఎప్పుడు ప్రారంభం అవుతుందో తెలియని పరిస్థితి.  


ఇలాంటి పరిస్థితులలో ఒక ప్రముఖ దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన ఫెయిల్యూర్ కెరియర్ గురించి ఆసక్తికర కామెంట్స్ చేసాడు. ‘నేను ట్రెండ్ మారిపోయిందనే అంచనాతో చేసిన పొరపాట్ల ఫలితమే నా కెరియర్ లో ఒడుదొడుకులు అని భావిస్తా. నా సినిమాల నుంచి గతంలో ఎక్కువ వినోదం అందించాను కాబట్టి ప్రేక్షకులు ప్రతిసారీ అదే స్థాయి కామెడీని ఆశించారు. కానీ నేను నా టైమింగ్‌ కు తగ్గట్లు కాకుండా వేరే టైపు కథలు ఎంచుకుని తప్పు చేసా. ఇక మళ్ళీ అలాంటి పొరపాట్లు చేయదల్చుకోలేదు’ అంటూ కామెంట్ చేసాడు.


వాస్తవానికి శ్రీను వైట్ల తన సినిమాల గురించి తనకు తాను చేసుకున్న విశ్లేషణ వాస్తవమే అయినప్పటికీ తన సినిమాలకు సంబంధించి  ఒకే ఫార్ముల పై ఆధారపడటంతో అవి తేడా కొట్టాయి అన్న కామెంట్స్ ఉన్నాయి. ఏది ఎలా ఉన్నా ఒక్క ఫెయిల్యూర్ వస్తే చాలు ఎంతటి గొప్ప దర్శకుడి అయినా ఫేడ్ అయిపోతున్న పరిస్థితులలో శ్రీనువైట్ల కు ఆలస్యంగా వచ్చిన జ్ఞానోదయం అతడి కెరియర్ ను రక్షిస్తుందో చూడాలి..


మరింత సమాచారం తెలుసుకోండి: