
టాలీవుడ్ లో ఇప్పుడు రీమేక్ ల హవా కొనసాగుతోంది. మెగాస్టార్ చిరంజీవి దగ్గర్నుంచి పవన్ కళ్యాణ్, వెంకటేష్ వంటి పెద్ద పెద్ద హీరోలు అందరూ వరుసగా రీమేక్ సినిమాలు చేస్తూ హిట్లు సంపాదిస్తున్నారు. ఎప్పటినుంచో ఈ పద్ధతి కొనసాగుతుండగా ఇప్పుడు రెండు మూడు సినిమాలను రీమేక్ చేస్తుండడం విశేషం. మెగాస్టార్ చిరంజీవి మలయాళం లూసిఫర్ సినిమాను తెలుగులో రీమేక్ చేస్తుండగా తమిళ సూపర్ హిట్ అయిన వేదాలం సినిమాను కూడా ఇక్కడ రీమేక్ చేస్తూ ప్రేక్షకులను ఆసక్తిగా పరుస్తున్నారు.
అలాగే విక్టరీ వెంకటేష్ కూడా వరుస రీమేక్ సినిమాలతో దూసుకుపోతున్నారు. ఇప్పటికే మలయాళంలో సూపర్ హిట్టయిన దృశ్యం సీక్వెల్ సినిమా ను తెలుగులోకి రీమేక్ చేస్తుండగా, తమిళంలో సూపర్ హిట్ అయిన అసురన్ సినిమాను నరప్ప గా చేసి విడుదలకు సిద్ధం చేశారు. ఇటీవలే ఈ సినిమాకు సెన్సార్ కూడా పూర్తి అయ్యింది. పవన్ కళ్యాణ్ మలయాళ సూపర్ హిట్ సినిమా అయ్యప్పనుం కోశియం అనే సినిమాను తెలుగులో రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే. ఇందులో రానా మరో హీరోగా నటిస్తున్నాడు. ఇటీవలే బాలీవుడ్ సినిమా పింక్ ను తెలుగులో వకీల్ సాబ్ పేరుతో రీమేక్ చేసి హిట్ అందుకున్నారు.
ఇకపోతే మరొక మలయాళం సినిమాపై కన్నేసింది టాలీవుడ్. ఈ సినిమా నీ రీమేక్ చేయాలని చిరు వెంకీ ఇద్దరు దృష్టి పెట్టారట. అదే మమ్ముట్టి నటించిన వన్ అనే సినిమా. రాజకీయ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాను సంతోష్ విశ్వనాథ్ డైరెక్ట్ చేయగా సినిమా రీమేక్ హక్కులను బాలీవుడ్ కి గాను బోనీకపూర్ దక్కించుకున్నాడు. అయితే ఈ పొలిటికల్ సినిమా తెలుగులో ఇస్తే బాగుంటుందని వెంకటేశ్, చిరు లు భావిస్తున్నారట. ఈ నేపథ్యంలో ఈ సినిమాను ఎవరు చేస్తారో చూడాలి. మలయాళంలో సంచలన విజయం సాధించిన ఈ సినిమా మార్చి లో ప్రేక్షకుల ముందుకు వచ్చి అక్కడి ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.