
అయితే తన కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్స్ అయినటువంటి రెండు మూవీల్లో ఒకటి మగధీర అయితే మరో సినిమా రంగస్థలం అనే చెప్పాలి. ఈ రెండు సినిమాల్లో రంగస్థలం చెర్రీలోని నటుడిని మరో మెట్టు ఎక్కించిందనే చెప్పాలి. కాగా చెర్రీ మాత్రం మగధీర మూవీతోనే జపాన్ దేశ అభిమానులకు మరింత మరింత దగ్గరయ్యిపోయాడు ఈ మెగా హీరో.
ఇక అప్పటి నుంచి చాలా మంది అభిమానులే చరణ్ పట్ల తమ అభిమానాన్ని కనబరుస్తూనే ఉన్నారు జపాన్ అభిమానులు. కాగా ఇప్పుడు మరోసారి ఓ జపాన్ కపుల్ మాత్రం చరణ్ ఎనర్జిటిక్ రంగస్థలం సాంగ్ అయిన జిగేలు రాణితో అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చారు. అచ్చం చరణ్, పూజాహెగ్దే చేసినట్టే డ్యాన్సు చేసి అదరగొట్టారు.
వారిద్దరి ఎనర్జీతో అదరగొట్టేశారు ఆ జపాన్ కపుల్స్. ఇప్పుడు ఇదే వీడియో మెగా ఫ్యాన్స్ లో మంచి క్రేజ్‌ను పెంచేసింది. ఇప్పుడు ప్రస్తుతం చరణ్ ఆర్ ఆర్ ఆర్ మూవీతో పాటు ఆచార్య సినిమాలయిన పెద్ద ప్రాజెక్టుల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు. ఇవి రెండు సినిమాలు భారీ మల్టీస్టారర్ అనే విషయం అందరికీ తెలిసిందే. ప్రస్తుతం ఈ జపాన్ కపుల్స్ వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తోంది. ఏదేమైనా చెర్రీకి జపాన్‌లో బాగానే క్రేజ్ ఏర్పడుతోందని చెప్పాల్సిందే. మరి ముందు ముందు ఆయన స్థాయి ఇంకా పెరిగే అవకాశం ఉంది.