
కళ్యాణ్ రామ్ కెరియర్ లో చేసిన సినిమాలలో ‘పటాస్’ తప్ప ఏఒక్క సినిమా సరైన విజయం సాధించలేదు. నందమూరి ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఉండి ఉంటే ఈపాటికి కళ్యాణ్ రామ్ కెరియర్ ఎప్పుడో మరుగున పడిపోయేది. హరికృష్ణ మరణం తరువాత జూనియర్ కళ్యాణ్ రామ్ ల సాన్నిహిత్యం మరింత పెరగడంతో కళ్యాణ్ రామ్ తన సినిమాల విషయంలో మరింత వేగంగా అడుగులు వేస్తున్నాడు. ఈమధ్యనే ‘బింబిసార’ అనే సోషియో ఫాంటసీ టైమ్ ట్రావెల్ మూవీని అనౌన్స్ చేసిన కళ్యాణ్ రామ్ ఈమధ్య జరిగిన తన పుట్టినరోజు సందర్భంగా మరో మూడు సినిమాలు ప్రకటించడం ఇండస్ట్రీ హాట్ టాపిక్ గా మారింది. రాజేంద్ర రెడ్డి దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ లో కళ్యాణ్ రామ్ ఒక సినిమాను చేస్తున్నాడు. ఈక్రమంలో తన 20వ చిత్రాన్ని దిల్ రాజు బ్యానర్ లో చేయబోతున్నట్లు ప్రకటించారు. సినిమాటోగ్రాఫర్ నుంచి డైరెక్టర్ గా మారిన కేవీ గుహన్ దర్శకత్వంలో కళ్యాణ్ రామ్ గతంలో ‘118’ అనే సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ మూవీని చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు కూడ కేవీ గుహన్ డైరెక్షన్ లోనే కళ్యాణ్ రామ్ 20వ సినిమా విడుదల కాబోతోంది. కళ్యాణ్ రామ్ కు బర్త్ డే విషెస్ అందిస్తూ ఈ చిత్రానికి సంబంధించిన ఒక పోస్టర్ ను ఈమధ్య విడుదల చేసారు. ‘క్రైమ్ సీన్ డు నాట్ క్రాస్’ అన్న క్యాప్క్షన్ ను బట్టి ఈమూవీ కూడ ‘118’ సినిమా తరహాలోనే మరో కొత్త కాన్సెప్ట్ తో రాబోతున్నట్లు అనిపిస్తోంది. ఒకవైపు సినిమాలు చేస్తూనే కళ్యాణ్ రామ్ తన ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై జూనియర్ తో వరసపెట్టి సినిమాలు తీస్తున్నాడు. త్వరలో కొరటాల శివ దర్శకత్వంలో కళ్యాణ్ రామ్ జూనియర్ తో తీయబోతున్న మూవీతో బ్లాక్ బష్టర్ నిర్మాతగా మారాలని చాల గట్టి ప్రయత్నాలు చేస్తున్నాడు..
|