
టాలీవుడ్ లో మా ఎలక్షన్ ల రగడ ఏ విధంగా ఉంటుందో గతంలో చాలాసార్లు మనం చూశాం. ఈసారి కూడా అంతే రసవత్తరంగా ఈ ఎన్నికలు జరగబోతున్నాయని మొన్నటిదాకా ఆర్టిస్ట్ ల మధ్య జరిగిన వాగ్వాదం ద్వారా తెలిసింది. అయితే గత కొన్ని రోజులుగా దీనిపై ఎవరు కూడా పెద్దగా మాట్లాడక పోవడం తో ఈ ఎన్నికలు సాఫీగా జరుగుతున్నాయి అనుగొన్నారు అందరు. త్వరలో జరగబోయే అసోసియేషన్ ఈ ఎన్నికల వ్యవహారం రోజు రోజు కు ఆసక్తి పరుస్తున్న నేపథ్యంలో మంచు విష్ణు తాజాగా విడుదల చేసిన ఒక వీడియో ఇప్పుడు ట్రెండింగ్ గా నినిలిచింది.
మా అసోసియేషన్ అధ్యక్ష పదవికి ప్రకాష్ రాజ్, మంచు విష్ణు, జీవిత, హేమ, సివిఎల్ నరసింహారావు లాంటి ప్రముఖులు పోటీ పడుతున్న విషయం తెలిసిందే. ఈ అధ్యక్ష పోటీలో విజయం సాధించేందుకు ఎవరికి గ్రౌండ్ వర్క్ ప్రారంభం చేశారు. తాజాగా మంచు విష్ణు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. మా అసోసియేషన్ బిల్డింగ్ కి అయ్యే ఖర్చు మొత్తం అంటూ సంచలన ప్రకటన చేశారు. మద్రాస్ఫిలిం ఇండస్ట్రీ ఉన్నప్పుడు సౌత్ లో ఒక నడిగర్ సంఘం మాత్రమే ఉండేది. తెలుగువారికి మాత్రమే ప్రత్యేకంగా అసోసియేషన్ ఉంటే బాగుంటుందని అప్పట్లో సినీ పెద్దలు తెలుగు అసోసియేషన్ ను ప్రారంభించారు.
తర్వాత టాలీవుడ్ హైదరాబాద్ వచ్చింది. ఇక్కడ గత అధ్యక్షులు ఎంతో చక్కగా సినీ ఆర్టిస్టులను చూసుకున్నారు. 1997లో సినీ కార్మికుల కోసం ప్రభుత్వం భూమిని కేటాయించింది. ఇప్పటి వరకు మనకు బిల్డింగ్ లేదు. మా నాన్న గారికి ఎలాంటి పదవి లేకపోయినా కూడా సినీ కార్మికులకు ఎంతగానో సేవ చేస్తూ వచ్చారు. ఇలాంటి విషయాలు చాలా చెప్పిన మంచు విష్ణు చివరి లో పెద్దల మాట ప్రకారం ఒకరిని ఏకగ్రీవంగా ఎన్నిక చేస్తే మంచిది అని చివర్లో చెప్పడం కొసమెరుపు. మరి మంచు విష్ణు ప్రకటించిన ఈ బిల్డింగ్ ఐడియా ఆయనకు బాగానే వర్కవుట్ అయ్యేట్లు కనిపిస్తుంది. చాలా మంది ఆర్టిస్టులు ఇప్పుడు మంచు విష్ణు కు సపోర్ట్ పలుకుతున్నారు.