
శ్రీహరి సినిమాలలోకి రాకముందు ఎలమర్రు లో ఒక రోడ్డు పక్కన చిన్న సైకిల్ మెకానిక్ షాప్ చూసుకునే వాడట. అందులో సమయం దొరికినప్పుడల్లా, ఆ షాప్ కు ముందు ఉన్న శోభన థియేటర్ కు వెళ్లి ఆయన సినిమాలు చూడడం మొదలుపెట్టాడు. అలా సినిమాలపై ఆసక్తి పొందడంతో, సినిమాల్లోకి రావాలని కోరుకున్నాడు. ఇకపోతే శ్రీహరికి చిన్నప్పటినుంచి బాడీ బిల్డర్ అవ్వాలి అనేది ఒక పెద్ద కోరిక అట. అలా ఎన్నోసార్లు బాడీ బిల్డర్ పోటీల్లో పాల్గొని , దాదాపుగా మిస్టర్ హైదరాబాదుగా ఏడుసార్లు అవార్డు కూడా అందుకున్నాడు.
అంతేకాదు 1988వ సంవత్సరంలో సినీ ఇండస్ట్రీలోకి ప్రవేశించి , స్టంట్ మాస్టర్ గా తన సినీ జీవితాన్ని మొదలుపెట్టి తర్వాత ప్రతినాయకుడి పాత్రలలో నటించేవారు. ఇక ఆయన హీరో అవ్వాలన్న కోరిక తోనే మొదట క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పనిచేసి, ఆ తర్వాత ప్రతినాయకుడిగా చేసి ప్రేక్షకులను మెప్పించి, చివరికి హీరోగా ఎదిగాడు. ఇలా ఎన్నో సినిమాలలో నటించి తనకంటూ ఒక మంచి గుర్తింపును తెచ్చుకున్నాడు. ఇక అలా సినీ జీవితాన్ని మొదలు పెట్టి ఆ తరువాత నిర్మాతగా కూడా కొన్ని సినిమాలకు వ్యవహరించాడు. దర్శకుడిగా తనలో ఉన్న ప్రతిభను చూపి సినిమాలను విజయవంతం చేశాడు. ఎన్నో రంగాలలో తమ ప్రతిభను చూపాడు శ్రీ హరి.