టాలీవూడ్ ఇండస్ట్రీలో నందమూరి బాలకృష్ణ, కోడి రామకృష్ణ కాంబినేషన్‌‌కు మంచి క్రేజ్ ఉంది. ఇక వీరిద్దరి కాంబినేషన్ లో ఏడూ సినిమాలు వచ్చాయి. అందులో ఐదు సినిమాలు బ్లాక్ బస్టర్ అయితే ఒకటి సూపర్ హిట్ గా నిలిచింది. ఒక్క సినిమా మాత్రం ప్లాప్ గా నిలిచింది. అయితే బాలకృష్ణ, కోడి రామకృష్ణ కాంబినేషన్‌లో వచ్చిన సినిమాలు టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో రికార్డులు క్రియేట్ చేసింది.

కోడి రామకృష్ణ దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ వచ్చిన తొలి చిత్రం ‘మంగమ్మ గారి మనవడు’. ఈ చిత్రం హీరోగా బాలయ్యకు క్రేజ్ తీసుకొచ్చింది. అంతేకాక.. ఈ సినిమా 500 రోజులకు పైగా నడిచి ఇండస్ట్రీ హిట్‌‌గా నిలిచిపోయింది. ఆ తరువాత నందమూరి బాలకృష్ణ, కోడి రామకృష్ణ కాంబినేషన్‌లో వచ్చిన రెండో చిత్రం ‘ముద్దుల కృష్ణయ్య. ఈ సినిమా థియేటర్ వద్ద బ్లాక్ బస్టర్ సక్సెస్ గా నిలిచింది. ఇక  కోడి రామకృష్ణ, నందమూరి బాలకృష్ణ కాంబినేషన్‌లో వచ్చిన మూడో చిత్రం ‘మువ్వ గోపాలడు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ సక్సెస్ గా నిలిచింది.

కోడి రామకృష్ణ దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ హీరోగా వచ్చిన సినిమా నాలుగవ సినిమా ‘భారతంలో బాలచంద్రుడు. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద అనుకున్నంతగా రాణించలేదు. ఆ తరువాత  కోడి రామకృష్ణ, నందమూరి బాలకృష్ణ కాంబినేషన్‌లో వచ్చిన ఐదో చిత్రం ‘ముద్దుల మావయ్య’. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ సక్సెస్ గా నిలిచింది. అంతేకాక.. ఇండస్ట్రీ రికార్డులను తిరగ రాశారు. ఇక కోడి రామకృష్ణ, నందమూరి బాలకృష్ణ కాంబినేషన్‌లో వచ్చిన ఆరో చిత్రం ‘బాల గోపాలుడు’. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది.

అయితే నందమూరి బాలకృష్ణ, కోడి రామకృష్ణ కాంబినేషన్‌లో వచ్చిన సినిమా ముద్దుల మేనల్లుడు ఏడో చిత్రం. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. అలాగే వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన ఎనిమిదో సినిమా విక్రమసింహ భూపతి. ఈ సినిమా దాదాపుగా  80 శాతం షూటింగ్ కంప్లీటైన ఈ జానపద చిత్రం నిర్మాత ఎస్.గోపాల్ రెడ్డి మరణంతో మధ్యలో ఆగిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: