సరిలేరు నీకెవ్వరు సినిమా తో హిట్ కొట్టిన తర్వాత మహేష్ బాబు ఏరికోరి మరీ చేస్తున్న సినిమా సర్కారు వారి పాట. గీత గోవిందం సినిమా తో సూపర్ హిట్ అందుకున్న దర్శకుడు పరశురామ్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ చివరి దశ లో ఉండగా త్వరలోనే విడుదల తేదీని ప్రకటించనున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమాను విడుదల చేయాలని ఆలోచిస్తున్నారు మేకర్స్.

ఎస్.ఎస్ తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా కరోనా కారణంగా పలుమార్లు వాయిదా పడగా ప్రస్తుతం రెగ్యులర్ షూటింగ్ చేసుకుంటుంది. అయితే సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ సినిమా నుంచి వస్తున్న లీకులపై కాస్త సీరియస్ గా ఉన్నాడు. దీనిపై చిత్ర యూనిట్ కి గట్టిగా వార్నింగ్ ఇచ్చాడని తెలుస్తోంది. ఇటీవలే సర్కారు వారి పాట సినిమా నుంచి కొన్ని చిత్రాలు లీక్ కాగా అవి సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారాయి. దాంతో సెట్స్ లో చాలా కఠినమైన నిబంధనలు పెట్టారని తెలుస్తోంది.

సెట్స్ లోకి ఎవరి మొబైల్ నీ ఎలో చేయకుండా రూల్ పెట్టారట. ప్రస్తుతం హైదరాబాద్ లో ఈ సినిమా షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది. కీలకమైన సన్నివేశాలు, ఎమోషనల్ సీన్స్ తెరకెక్కిస్తున్నారు. దీంతో ఈ సినిమా నుంచి వస్తున్న లీకులను అడ్డుకునేందుకు సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ విధంగా కఠిన చర్యలు తీసుకోక తప్పలేదు అని అంటున్నారు. బ్యాంకులను మోసం చేసే బడా వ్యాపారవేత్తలను టార్గెట్ చేస్తూ విమర్శనాత్మకంగా ఈ సినిమాను రూపొందిస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. మహేష్ బాబు రెండు డిఫరెంట్ రోల్స్ చేస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్, 14 రీల్ ఎంటర్ టైన్మెంట్స్  బ్యానర్ పై మహేష్ బాబు సంయుక్తంగా నిర్మిస్తున్నా డు. 

మరింత సమాచారం తెలుసుకోండి: