చిరు అంటే టాలీవుడ్ లో పెద్దగా ఈయన గురించి పరిచయం చేయనవసరం లేదు. ఎంతోమంది తెలుగు ప్రేక్షకులను తమ అభిమానులుగా సంపాదించుకున్నారు. ఎన్నో అపురూపమైన సినిమాలలో నటించి, టాలీవుడ్ లో స్టార్ హీరోగా ఎదిగారు. ఇక రాజకీయంగా కూడా అటు వైపు వెళ్లినా.. మళ్లీ తిరిగి సినిమాల వైపే అడుగు వేసాడు. ఇక మెగాస్టార్ కూడా ఎప్పుడు సోషల్ మీడియా కు బాగా దగ్గర లోనే ఉంటారు. ఇక ఈయన సమాజ సేవకై పాటుపడడం లో ముందుంటాడు అని కూడా చెప్పవచ్చు.


ఇక అంతే కాకుండా మెగా ఫ్యామిలీలో ఎటువంటి ఫంక్షన్ జరిగినా ముందుగా సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంటాయి. ఇక అంతే కాకుండా సినీ ఇండస్ట్రీలో ఎంతోమందికి సహాయపడ్డాడు చిరు. శుభ సందర్భాలలో తనదైన శైలిలో ఎవరికైనా సరే తన తరఫునుంచి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉంటారు. సీనియర్ నటులలో ఒకరైన కైకాల సత్యనారాయణ  పుట్టినరోజు సందర్భంగా  చిరంజీవి తనకి శుభాకాంక్షలు తెలిపాడు. ఇక అంతే కాకుండా వారి ఆర్థిక పరిస్థితి ఎలా ఉందో కూడా తెలుసుకున్నాడు.


చిరంజీవికి కైకాల సత్యనారాయణ అంటే చాలా ఇష్టమట. అదే ఇష్టం తోనే స్వయానా చిరంజీవి, తన భార్య కలిసి  కైకాల సత్యనారాయణ ఇంటికి వెళ్లి అతనికి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు చిరంజీవి. ఇక ఈ విషయాన్ని చిరంజీవి స్వయానా తన ట్విట్టర్ ఖాతా ద్వారా తెలిపారు. చిరంజీవి, కైకాల కలిసి ఎన్నో సినిమాలలో కలిసి నటించారు. ఇక కైకాల సినిమా బ్యానర్ పై కూడా చిరంజీవి అప్పట్లో నే  సినిమాలో నటించారని కూడా తెలుస్తోంది.


ఏదిఏమైనా చిరంజీవి ఇలా వచ్చి కైకాల గారికి సర్ ప్రైజ్ ఇవ్వడం చాలా ఆనందంగా ఉందని సినీ ఇండస్ట్రీలో వినికిడి. అయితే ఆర్థికంగా ఎంత సహాయం చేశారు అనేది మాత్రం ఆయన బయటకి చెప్పలేదు. ఏది ఏమైనా మహానటుడు అయిన కైకాల సత్యనారాయణను, సినీ ఇండస్ట్రీ పెద్దలు గౌరవంగా ఆదుకోవడం చాలా సంతోషంగా ఉందని ,పలువురు ప్రముఖులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: