సూపర్ స్టార్ మహేష్ తన కెరియర్ లో రాజకుమారుడు తర్వాత మహేష్ కు సూపర్ హిట్ ఇచ్చిన సినిమా మురారి. కృష్ణవంశీ డైరక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా మహేష్ కెరియర్ లో చాలా స్పెషల్ మూవీ అని చెప్పొచ్చు. మురారి పాత్రలో మహేష్ నటన అద్భుతమని చెప్పొచ్చు. సినిమాలో మహేష్ నటనకు స్పెషల్ జ్యూరీ నంది అవార్డ్ వచ్చింది. కమర్షియల్ గా కూడా మహేష్ ఖాతాలో మొదటి బంపర్ హిట్ అని చెప్పొచ్చు.

ఈ సినిమాతో మహేష్ కు ఫ్యామిలీ ఆడియెన్స్ ఫాలోయింగ్ పెరిగింది. మురారి సినిమాలో మహేష్ నటనకు లేడీ ఫ్యాన్స్ కూడా ఫిదా అయ్యారు. ఇక ఈ సినిమా తర్వాత మహేష్ టక్కరి దొంగ, బాబీ సినిమాలు చేశాడు. ఆ రెండు సినిమాలు వర్క్ అవుట్ కాలేదు. ఇక ఆ తర్వాత గుణశేఖర్ డైరక్షన్ లో వచ్చిన ఒక్కడు సెన్సేషనల్ హిట్ అయ్యింది. ఒక్కడు సినిమా మహేష్ కెరియర్ లో మైల్ స్టోన్ మూవీ అని చెప్పొచ్చు. ఈ సినిమాతో మహేష్ నెక్స్ట్ లెవల్ కు వెళ్లాడు. ఇక ఆ తర్వాత వరుస మాస్ సినిమాలు చేస్తూ వచ్చాడు. ఇక పోకిరి తర్వాత స్టార్ గా ఎదిగాడు.

పోకిరి తర్వాత మహేష్ తో మురారి సీక్వల్ చేయాలని అనుకున్నారు. కృష్ణవంశీ రైటింగ్ టీం తో కథ కూడా సిద్ధం చేయించాడు. కాని మహేష్ మాత్రం ఆ సినిమా ఒక మంచి ప్రయోగమని ఆ సినిమా సీక్వల్ తీసి చెడగొట్టద్దు అని చెప్పాడట. మురారి 2 అంటే మళ్లీ మహేష్ ని సాఫ్ట్ హీరోగా చూపించాలి ఇప్పుడున్న మాస్ ఇమేజ్ కు అది తగదని వద్దన్నాడు. అయితే కృష్ణవంశీ మాత్రం ఎప్పటికైనా మహేష్ తో మురారి 2 చేయాలని అనుకుంటున్నాడు.  అయితే మహేష్ అందుకు ఒప్పుకుంటాడా లేదా అన్నది మాత్రం చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: