టాలీవుడ్ సినీ పరిశ్రమలో సినిమాలు కొన్ని సీజన్లలో ఎక్కువగా విడుదలవుతుండడం మనం చూస్తుంటాం. మంచి టైం లో పెద్ద పెద్ద సినిమాలు విడుదల చేయడానికి నిర్మాతలు చూస్తుంటారు. పండుగ సమయంలో, వేసవి సమయంలో, సెలవులు ఎక్కువగా ఉన్న సమయంలో ఈ సినిమాలు విడుదల చేస్తూ హిట్లు కొడుతూ భారీగా కాసుల వర్షం కురిపించుకుంటూ ఉంటారు. ఆ విధంగా టాలీవుడ్ కి బాగా కలిసి వచ్చిన సీజన్ సంక్రాంతి ప్రతి సంవత్సరం సంక్రాంతిసీజన్ లో పెద్ద పెద్ద సినిమాలు విడుదల కావడానికి పోటీ పడతాయి.

ఆ విధంగా 2022 సంవత్సరానికి గాను పెద్ద సినిమాలు సంక్రాంతికి విడుదల కానున్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. మహేష్ బాబు ఈ సంక్రాంతి స్లాట్ ను అందరికన్నా ముందుగా బుక్ చేసుకున్నాడు. గతేడాది ఇదే పండగకు సరిలేరు నీకెవ్వరు సినిమా ను విడుదల చేసి భారీ హిట్ కొట్టగా ఈ సంక్రాంతికి సర్కారు వారి పాట సినిమాను బరిలోకి దింపుతున్నారు మహేష్. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా ఇప్పటికే ఇచ్చారు. అలాగే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా ఈ సంక్రాంతి సీజన్ పై కన్నేసాడు. ముందుగా క్రిష్ హరిహర వీరమల్లు సినిమా ఈ సీజన్ కి తీసుకొస్తామని ప్రకటించగా ఆ సినిమా షూటింగ్ పూర్తి కాకపోవడంతో అయ్యప్పనుం రీమేక్ ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు.

అలాగే విక్టరీ వెంకటేష్ వరుణ్ తేజ్ లు కలిసి నటిస్తున్న మల్టీస్టారర్ చిత్రం ఎఫ్3 కూడా ఈ సంక్రాంతికే విడుదల కాబోతుంది. 2018 వ సంవత్సరంలో సంక్రాంతికి విడుదలైన ఎఫ్2 సినిమాకు ఇది సీక్వెల్ కాగా అప్పుడు అది సూపర్ హిట్ అయ్యింది.ఆ సెంటిమెంట్ మళ్లీ పునరావృతం కావాలని కోరుకుంటున్నారు ఈ సినిమా నిర్మాతలు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తమన్నా భాటియా, మెహ్రీన్ లు హీరోయిన్ లు గా నటిస్తున్నారు. ఈ ఫ్యామిలీ అండ్ కామెడీ ఎంటర్టైనర్ కు మంచి ఆదరణ లభిస్తుందని భావిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: