
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ఆచార్య సినిమా పరిస్థితి ఇప్పుడు ఎలా ఉంది అంటే ముందు నుయ్యి వెనుక గొయ్యిలా తయారయింది. మెగాస్టార్ చిరంజీవి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తొలిసారిగా కలిసి నటిస్తున్న సినిమా కావడంతో మెగా అభిమానులు ఈ సినిమా పై భారీ అంచనాలు ఏర్పరుచుకుని కళ్ళు కాయలు కాసేలా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ కావడంతో త్వరలోనే విడుదల కాబోతుంది అని ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు.
మరోవైపు పెద్ద హీరోలు అందరూ తమ సినిమాల విడుదల తేదీలను ఇప్పటికే ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఆచార్య సినిమా ఎప్పుడు విడుదల అవుతుందో అని ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఈ నెల 22న మెగాస్టార్ చిరంజీవి బర్త్ డే కావడంతో ఆ రోజు సినిమా రిలీజ్ డేట్ పై స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తున్నట్లు తెలుస్తుంది. సంక్రాంతి బరిలోకి తీసుకొద్దామంటే ఇప్పటికీ సంక్రాంతి సీజన్ కు ఐదు భారీ సినిమాలు రావడం తో ఆచార్య ఆ టైంలో వచ్చేందుకు వెనకడుగు వేస్తుందని తెలుస్తుంది. దాంతో మరొకసారి చిరంజీవి ఆచార్య సినిమాను ఎప్పుడు విడుదల చేద్దాం అన్న డైలమాలో పడ్డారు.
తన సినిమా ని క్రిస్మస్ కానుకగా విడుదల చేద్దామనుకుంటే యశ్ హీరోగా నటించిన కేజిఎఫ్ రెండవ భాగం సినిమా డిసెంబర్ 24న విడుదల చేయాలని అనుకుంటున్నారట దర్శకుడు ప్రశాంత్ నీల్. దీంతో చిరంజీవి తన సినిమాను ఎటువంటి పోటీ లేకుండా విడుదల చేయాలనే ఆలోచన కు బ్రేక్ పడ్డట్లు అయ్యింది. మరోవైపు ఏపీ థియేటర్ల టికెట్ సమస్యలు ఉండడం , ఇంకోవైపు సినిమాలో సోనూ సూద్ విలన్ గా నటిస్తుండడం ఈ సినిమాకు ప్రతికూలంగా మారే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. ఇటీవలే విడుదలైన సోను సూద్ పాత్ర లుక్ కు నెగెటివ్ కామెంట్స్ వచ్చాయి. బయట రియల్ హీరో అన్నట్లుగా సోనూసూద్ ను అభివర్ణించారు నెటిజన్లు. మరి ఒకవేళ ఆ పాత్రను సినిమా లో తక్కువ చేసి చూపిస్తే అది మొత్తం సినిమాపై ప్రభావం పడే అవకాశం ఉంది.