1).Rx 100 సినిమా ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు కార్తికేయ. కానీ ఆ తర్వాత వరుస సినిమాలతో ఫ్లాపులను చవిచూశాడు. ఇక గుణ 369 సినిమాతో పరవాలేదు అనిపించుకున్నా, ఆ తర్వత ఇక ఏ సినిమా సరిగ్గా ఆడలేదు.
2).ఇక మరొక హీరో హ్యాపీ డేస్ సినిమా తో బాగా మంచి పేరు తెచ్చుకున్న వరుణ్ సందేశ్.. ఆ తర్వాత కొత్త బంగారు లోకం సినిమాతో స్టార్ హీరో రేంజ్ కి వెళ్తాడు అనుకుంటే.. ఆ తర్వాత ఒక్క సినిమా కూడా హిట్ కాలేదు.
3).మరొక హీరో ఉయ్యాల జంపాల తో మంచి హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు రాజ్ తరుణ్.. ఒకానొక సమయంలో వరుస హిట్లతో దూసుకుపోయాడు.. కానీ ప్రస్తుతం ఎన్నో ఫ్లాప్ సినిమాలు చేశాడు.
4). సాధారణంగా సినీ ఇండస్ట్రీలో హీరో కొడుకు హీరో అవ్వడం చాలా సర్వసాధారణం. అయితే అలాంటిది సాయికుమార్ తన కొడుకుని హీరోగా చేయాలని గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చినా ఆ సినిమా సక్సెస్ అయింది. అంతేకాకుండా సినిమాకు ఫిలిం ఫేర్ అవార్డు కూడా సంపాదించింది. కానీ ఆ తర్వాత ఒక్క సినిమా కూడా హిట్ కాలేదు ఆదికి.
ఇక ఈ వీరే కాకుండా మోహన్ బాబు కుమారుల పరిస్థితి కూడా అలానే ఉంది. ఒకప్పుడు బాగా మంచి మూవీలతో స్టార్ హీరోలుగా ముందుకు వచ్చినా, ఇప్పుడు వరుస ప్లాప్ సినిమాలతో డిజాస్టర్ ను చవిచూస్తున్నారు.
అందుచేతనే సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ల,హీరోల పరిస్థితి కూడ ఇంత దారుణంగా ఫ్లాపులతో చవిచూశారు. కాబట్టే ముందు జాగ్రత్తగా కథలను ఎంచుకుని సమయంలో ఎన్నో జాగ్రత్తలు వహించాలని సినీ ఇండస్ట్రీ పెద్దలు చెబుతూ ఉంటారు.