రాజమౌళి దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ లు హీరోలుగా నటిస్తున్న చిత్రం ఆర్ ఆర్ ఆర్. దేశవ్యాప్తంగా ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్న సంగతి తెలిసిందే. దసరాకి ఈ సినిమాను విడుదల చేసేందుకు చిత్ర బృందం కసరత్తులు చేస్తోంది. ఈ నేపథ్యంలో ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్ పనులను వేగవంతం చేసింది.  ఇప్పటికే ఈ సినిమాలోని పాటలను విడుదల చేసి ప్రేక్షకుల్లో ఆసక్తి కనబరిచిన ఈ సినిమా ఇప్పుడు రెండో సాంగ్ విడుదల చేయడం కోసం సిద్ధమవుతోంది.

మొదటి పాట ప్రేక్షకుల్లో ఎంతో ఆసక్తిని నెలకొల్పగా రెండో పాట ఇంకా ఏ రేంజ్ లో ఉంటుందో అని అంచనాలు పెట్టుకున్నారు ప్రేక్షకులు. తాజాగా ఈ రెండో పాటకు సంబంధించిన ఒక పిక్ బయటకు వచ్చింది. ఈ పిక్ చూస్తుంటే బ్రిటిష్ కాలానికి చెందిన పాటలా ఉంది. ఆ పిక్ లో గుర్రం బాణం గుర్తులు కూడా ఉండడంతో ఈ పాట కేవలం రామ్ చరణ్ మీద తీస్తున్నారా అనే డౌట్ వస్తుంది. త్వరలోనే ఈ పాటను విడుదల చేస్తారట.  దర్శకుడు రాజమౌళి విజన్ ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. ఆయన విజన్ కు విజయేంద్రప్రసాద్ కథ తోడైంది కాబట్టే ఇలాంటి సినిమాలు ఇప్పటి వరకు ఎన్నో వచ్చాయి. 

డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై డి.వి.వి.దానయ్య అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా అల్లూరి సీతారామరాజు పాత్రలో రామ్ చరణ్, ఎన్టీఆర్ కొమురంభీం పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్ తో పాటు బాలీవుడ్ టాప్ హీరోయిన్ అలియా భట్ మరియు ఒలివియా మోరిస్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఇంకా సముద్రఖని వంటి ఎంతో మంది నటులు సహాయక పాత్రలు పోషిస్తున్నారు. పాన్ ఇండియా రేంజ్  ఈ చిత్రం తెరకెక్కుతుంది గా ప్రస్తుతం చివరి షెడ్యూల్ జరుగుతుంది ప్రధాన తారాగణంపై ఓ స్పెషల్ సాంగ్ తెరకెక్కిస్తున్నారు

మరింత సమాచారం తెలుసుకోండి:

RRR