నేచురల్ స్టార్ నాని హీరోగా తెరకెక్కిన ‘జెర్సీ’ సినిమా సూపర్ హిట్ అవడంతో పాటు జాతీయ అవార్డు దక్కిన సంగతి అందరికీ విదితమే. ఈ సినిమాలో నాని క్రికెటర్‌గా కనిపించాడు. నానికి జోడీగా బ్యూటిఫుల్ హీరోయిన్ శ్రద్ధా శ్రీనాథ్ నటించింది. గౌతమ్ తిన్ననూరి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో నాని నటనకుగాను ప్రేక్షకులతో పాటు విమర్శకుల నుంచి ప్రశంసలు లభించాయి. ఇకపోతే ఈ సినిమాను ప్రొడ్యూసర్స్ దిల్ రాజు, అరవింద్ హిందీలోనూ రీమేక్ చేస్తున్నారు. ఈ ఫిల్మ్‌కు కూడా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్నాడు.
షాహిద్ కపూర్ ఈ సినిమాలో నటిస్తుండగా, ఆయనకు జోడీగా మృణాల్ ఠాకూర్ నటిస్తోంది. బాలీవుడ్ లో ఈ సినిమాపైన ఫుల్ ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి. ఈ క్రమంలోనే గౌతమ్ తిన్ననూరి నెక్స్ట్ సినిమాను మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌తో చేయబోతున్నట్లుగా వార్తలొచ్చాయి. కానీ, అఫీషియల్ అనౌన్స్‌మెంట్ అయితే రాలేదు. అయితే, డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి ప్రస్తుతం హిందీ ‘జెర్సీ’ రీమేక్ ఫిల్మ్ పూర్తిచేసే పనిలో ఉన్నారు. కాగా, ఈ సినిమా తర్వాత గౌతమ్ మరోసారి నానితో సినిమా చేయాలనుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి.
ఇందుకుగాను ఆల్రెడీ స్క్రిప్ట్ రెడీ చేసేశాడట గౌతమ్. రెగ్యులర్ కమర్షియల్ సినిమాకు విభిన్నంగా గౌతమ్-నాని కాంబోలో మరో ఫిల్మ్ ఉంటుందని ఫిల్మ్ నగర్ సర్కిల్స్ టాక్. ఈ సారి కూడా యాజ్ ఈట్ ఈజ్‌గా ఆ సినిమాపైన భారీ అంచనాలే ఉంటాయి. ఇక శివ నిర్వాణ డైరెక్షన్‌లో నేచురల్ స్టార్ నాని హీరోగా తెరకెక్కిన ‘టక్ జగదీష్’ ఫిల్మ్ ఇంకా విడుదల కాలేదు. కొవిడ్ వల్ల రిలీజ్ పోస్ట్ పోన్ కాగా, ప్రస్తుతం ఓటీటీలో రాబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే, ఇందుకు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్‌మెంట్ అయితే ఇంకా రాలేదు. నేచురల్ స్టార్ నాని ప్రస్తుతం ‘అంటే సుందరానికి, శ్యామ్ సింగరాయ్’ చిత్రాల షూటింగ్స్‌లో ప్యారలల్‌గా పాల్గొంటున్నట్లు సమాచారం.

క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి